ఉగాది పండుగ వచ్చింది
ఉత్సాహాన్నే తెచ్చింది
వెల్లలు గోడకు వేసిరి వదినలు
గడపకు పసుపులు పూసితిరిగా
మామిడాకులను మానాన్న తెచ్చి
మంగళ తోరణం కట్టేడు
బాబయ్యేమో సాయము చేసెను బహుముఖాలుగా పండుగకూ
పచ్చడి దినుసులు పదిలముగా
పట్టుకు వచ్చెను అన్నయ్య
మామిడి కాయను ముక్కలుగా
చక్కగ తరిగెను అమ్మమ్మా
చేసెను తమ్ముడు చెరుకును చాలాచిన్నముక్కలుగా
ఏరిరి అక్కలు వేపపూతను
పూవులు పూవులు పూవులుగా
చెల్లాయేమో అరటి పండునూ
చక్కగ చక్రాలు చేసినది
బామ్మతరిగెను బెల్లం దిమ్మను
బహుమెత్తని పొడిగా వడిగా
పిన్నమ్మేమో
చింతపండును
పిసికెను రసముగ మార్చుటకు
అత్తమ్మేమో అన్నీ కలిపి
గాన్నెకు యెత్తెను గుత్తముగా
తారలు మామలు బావలు తొందర పెట్టిరి
పచ్చడి తినగను ఇష్టముతో
మాఅమ్మమో అంతర్యామికి
అర్పితమిచ్చినది సంతృప్తముగా
ఆపై పచ్చడి అరచేతులలో
ప్రసాదమంటూ పంచిందీ
ఆహా ఓహో అధ్భుతమంటూ
ఆరగించితిమి అందరము
అమృతమా అదియేపాటిది
మా ఉగాది పచ్చడి రుచిముందు.
స్వర్గమాఅది ఏపాటిది
మాఉమ్మడి కుటుంబపు ప్రాంగణంముందు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి