ఎక్కడివారు అక్కడే ఉండాలి!?;- ప్రతాప్ కౌటిళ్యా
 జీవ పరిణామ క్రమానికి సజీవ సాక్ష్యం మనిషి. దానికి ఆధారం జీవుల పరిణామ క్రమం. జీవులు మార్పులకు గురవుతూ అనువంశికంగా కొనసాగుతూ  పరిణామం జరిగింది. అక్కడే జీవుల నుంచి మనిషి పుట్టాడు. సరిగ్గా అలాగే జీవన్ పుట్టినప్పటినుంచి కేవలం ఒకే జీవజాతి గా ఉండకుండా రకరకాల జీవులుగా పరిణామం చెంది. కోట్ల జీవరాశులు ఏర్పడినాయి. అయితే అన్ని రకాల జీవులు భూమి మీద ఒకేసారి ఏర్పడలేదు. ముందు జీవన్ పుట్టింది. ఆ తర్వాతే మార్పులు జరిగి పరిణామం చెంది రకరకాల జీవులు జీవరాసులు పుట్టాయి. దీన్ని జీవపరిణామ సిద్ధాంతం నిరూపించింది. అంటే జీవులు అత్యున్నత స్థాయిలో మనిషిగా పుట్టడం పరిణామ సిద్ధాంత ప్రాముఖ్యం సంతరించుకున్నది.
వృక్షాలు జంతువులు దీనికి ఏమీ తీసిపోలేదు. ఏం జరిగినా నా భూమి మీద మాత్రమే జరిగింది. కానీ  భూమి మొత్తం భౌగోళికంగా శీతోష్ణస్థితి పరంగా వాతావరణ పరంగా అంతా ఒకేలా ఉండదు. అందుకే కే సముద్రం లో పెరిగిన జీవులు సముద్రంలో భూమి పై పెరిగిన జీవులు భూమిపై వాటి అనుకూల అనుకూల పరిస్థితులకు, అనుగుణంగా మారుతూ పెరుగుతూ కొనసాగినావీ. అంటే నీటిలో పెరిగిన జీవులు భూమిపై పెరగవు. భూమిపై కలిగిన జీవులు నీటిలో పెరిగవు. సరిగ్గా అలాగే భూమి ధ్రువాల దగ్గర పెరిగిన జీవులు భూమధ్య రేఖ దగ్గర పెరుగు లేవు. ఆయా భౌగోళిక శీతోష్ణస్థితి వాతావరణానికి అనుకూలంగా జీవరాశులు మన గలుగుతున్నాయి. కనుక వాటి ఆహారపు అలవాట్లు ప్రత్యుత్పత్తి రక్షణకు సంబంధించిన యంత్రాంగము అనువంశికంగా ఆయా జీవులకు అనుకూలంగా కొనసాగి జన్యుపరంగా కూడా ఆ సమాచారం నిక్షిప్తం చేయబడుతుంది.
అందుకే ధాన్యాలు వంటలు ఫలాలు పుష్పాలు కూడా భూసారం భౌగోళిక శీతోష్ణస్థితి వాతావరణానికి అనుకూలంగానే పెరుగుతాయి. భూగోళం అంతటా వాటిని పెంచే లేము పండించ లేము.. జన్యు పరంగా కూడా అనుకూలంగా ఉండి అననుకూల ప్రదేశాలలో వాటిని పండించే లేము పెంచ లేము. సరిగ్గా అలాగే జంతువులను కూడా అననుకూల ప్రదేశాలలో పెంచలేము. కానీ కానీ వీటికి విరుద్ధంగా మనిషి మాత్రం ఎక్కడైనా ఉండగలుగుతాడు. ఎందుకంటే అననుకూల ప్రదేశాలను అధిగమించి భూమిపైన ఎక్కడైనా నివసించ గల్గుతున్నాడు. నిజానికి మనిషికి ఆ అనుకూలత జన్యుపరంగా ఏర్పడలేదు కానీ నీ మనిషి తన మేధో సంపత్తితో వాటిని అధిగమించి సౌకర్యాలను ఏర్పరచుకొని భూమి మీద ఎక్కడైనా మన గలుగుతున్నాడు.
నిజానికి మనిషికి అనువంశికంగా ఆ అనుకూలత పొందలేదు. కానీ నీ భౌగోళిక శీతోష్ణస్థితి పరిస్థితులను వాతావరణాన్ని జయించి ఏర్పాట్లను ఏర్పాటు చేసుకున్నాడు అంతే. ప్రకృతిపై అతడు విజయం అదే కానీ అనువంశికంగా మాత్రం కాదు. భౌగోళిక శీతోష్ణస్థితి వాతావరణ పరిస్థితులకు మాత్రమే అనుకూలంగా పరిణామం చెందాడు. జన్యుపరంగా అది మాత్రమే అనుకూలంగా పరిణామక్రమంలో కొనసాగింది. ఇది ఈ భూమి మీద ఉన్న అన్ని జంతువులకు వర్తిస్తుంది.
అందుకే అంటారు తాబేలును తారు రోడ్డు పై ఉంచి పరిగెత్తడం అంటే ఎలా పరిగెడుతుంది ఎలా పోటీ పడుతుంది. దాన్ని నీటిలో ఉంచి పరిగెత్త మంటే పరిగెత్తుతుంది గెలుస్తుంది. అందుకే  జీవులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అదే పరిణామక్రమ సిద్ధాంత పరిపూర్ణత. లేదంటే మళ్లీ మార్పులకు గురై మరో కొత్త రకం జీవులు పుట్టే అవకాశం ఏర్పడుతుంది. ఇది నిరంతర ప్రక్రియ దీన్ని ఎవరు ఆపలేరు.
Dedicated to my beloved sister Padmavati and Rani.
Pratap Kautilya lecturer in biochemistry palam Nagar Kurnool district.8309529273

కామెంట్‌లు