ఎండాకాలం సమస్యలు- పి . కమలాకర్ రావు .

 మూత్రద్వారంలో మంట,
ముక్కులోనుండి  రక్తం కారడం.
- నివారణ.
కొన్ని దేశీ గులాబీ రిక్కలను సేకరించి  బాగాకడిగి  నీళ్ళల్లో వేసి
మరిగించి  చల్లార్చి వాడపోసిన  రసం లో పంచదార కలపాలి.
అందులో ఒక కప్పు తియ్యని
దానిమ్మ పళ్ల రసం కూడా కలిపి తగినంత నిమ్మరసం కూడా కలపాలి.
ఇప్పుడు మంచి తీయని రుచికరమైన పానీయం తయారయింది. ఇది శరీరానికి
చలువ చేస్తుంది.
ఇది త్రాగితే మూత్రద్వారంలో
మంటను తగ్గిస్తుంది.
ముక్కులో నుండి రక్తం కారితే
ఇది త్రాగితే తగ్గిపోతుంది.
ఉల్లిపాయ ముక్కను కోసి వాసన
చూడాలి. తడి గుడ్డతో ముక్కుపై
అద్దుకోవాలి.
కామెంట్‌లు