ఉగాది గజల్;- సోంపాక సీత భద్రాచలం
*శుభకృతుగ ఏతెంచెను..శుభములిచ్చు శుభఉగాది
వికృతములు పారద్రోలి..గుణములిచ్చు శుభ ఉగాది

ఆరురుచుల అనుభవాలు..మనజీవిత గమనంలో
నిలిచిగెలుచు మానవతకు..జయములిచ్చు శుభఉగాది

పచ్చదనం పైటవేసి..చైత్రరాణి శోభిల్లెను
సహజవనరులు పొదుపుచేయి..ఫలములిచ్చు శుభఉగాది

పులుపు,వగరు చేదుకూడ..సమతుల్యపు ఆహారమె
ఇది సత్యం ఆరోగ్యపు..వరములిచ్చు శుభఉగాది

శుభకృత్తు'పల్లవించె..తెలుగునాట మదిమదిలో
సిరి'సీతా' ప్రతిఇంటా.. ముదములిచ్చు శుభఉగాది

 

కామెంట్‌లు
Unknown చెప్పారు…
ముదములిచ్చు శుభ ఉగాది
👌👌💐💐💐💐సిరిసీత గారూ
ఉగాది శుభాకాంక్షలు