ఓ మనసా ఎందుకే అలక;-జికె నారాయణ;-కలం స్నేహం
ఓ మనసా
ఏమిటో నీ అలక
కాని దానికోసం తెగ ఆరాటపడతావు. 
చేరువలో ఉన్నదాన్ని చూసి
దరికి చేర్చుకోవాలని కోరుకోవు...!! 

జీవితం అంటే ఆశించిందే
జరగాలని ఆత్రపడకు.
ఏది దొరకాలో అదే నీకు దొరుకుతుంది. 
నీ చెంతచేరి నీ వశమవుతుంది....!! 

కాలమనే కాలచక్రంలో
కాలంతో పాటు పయనం కొనసాగిస్తూ మున్ముందుకు పయనం చేయాల్సిందేనని 
తెలుసుకొని మసలుకో....!! 

ఎవరికి ఏది దక్కాలో
దేవుడు నుదుటి వ్రాత వ్రాసే ఉంటాడు. 
కాబట్టి దేని మీద అత్యాశ పెంచుకోక
నీ ప్రయత్నాన్ని ఆపుకోకు.....!!

ఓ మనిషి 
మనసుని నిర్మలంగా ఉంచుకొని
అనుకున్న లక్ష్యం వైపు
దృష్టి సారించు విజయం నీదే .
నీ మనసును నియంత్రణలో ఉండేలాగ
పదిలంగా చూసుకో...!! 
*********


కామెంట్‌లు