పెళ్లి సందడి--బాలగేయం ; ;-ఎం. వి. ఉమాదేవి
పెళ్ళికి మేము వెళ్ళాము 
లడ్డూ వడలు తిన్నాము 
బాజాలెన్నో మోగాయి 
మాటలు బాగా సాగాయి !

పందిరి కింద కుర్చీలు 
అల్లరి పిల్లలు గలభాలు 
ఫోటో వీడియో తీశారు 
పంతులు గారు వచ్చారు !

చక్కని మెరుపుల దుస్తుల్లో 
పెళ్లికూతురుకి సిగ్గుల్లో 
గోరింటాకు పండిండోయ్ 
పెళ్లి బాగా జరిగిందోయ్ !!

కామెంట్‌లు