శివయ్య రామయ్య ఇద్దరు నేతివ్యాపారులు.శివయ్య ఐదువందల మొహిరీలు అప్పు తీసుకుని చిన్న చిన్న అప్పులు తీర్చేశాడు.రామయ్య ఒక వారం దాకా చూసి తన మొహిరీలు తిరిగి ఇచ్చేయమంటే శివయ్య అతన్ని డబాయించాడు"ఏంటీ!నీదగ్గర అప్పుఎప్పుడు తీసుకున్నా ను?నాదీ వ్యాపారమే గదా?"అని దబాయించాడు.
చేసేది ఏమీ లేక రామయ్య ఆఊరిన్యాయాధికారిదగ్గరకెళ్లి లబోదిబో మొత్తుకున్నాడు.ఆయన ఓఉపాయం పన్నాడు.నాలుగు చిన్న నేతి డబ్బాలు తెప్పించి రెండు డబ్బాలలో రెండు మొహిరీలు వేశాడు.ఇంకో ఇద్దరు నేతివ్యాపారులను కూడా పిలిపించాడు.శివయ్య రామయ్యలకు మొహిరీలు వేసిన డబ్బాలు మిగతా ఇద్దరికి మామూలు నేతి డబ్బాలు ఇచ్చి ఓగంటలో ఆనెయ్యి నాణ్యత వాటి వెల చెప్పమని ఇళ్లకి తీసుకుని పొమ్మన్నాడు.అందరూ ఆనేతి డబ్బాలతో వచ్చి వాటి నాణ్యత విలువలు చెప్పారు. శివయ్య డబ్బాలో మొహిరీలు లేవు.నెయ్యి కూడా కాస్త తక్కువగానే ఉంది. అంటే శివయ్య నెయ్యితోపాటు ఆరెండు మొహిరీలు కాజేశాడు.రామయ్య ఇచ్చిన డబ్ఫాను మొహిరీలు నెయ్యితో సహా తెచ్చి న్యాయాధికారికి అప్పగించాడు.మిగతా ఇద్దరు అలాగే ఇచ్చి తమకు తోచిన వెలచెప్పారు.అందరిముందూ శివయ్య ని అడిగాడు "ఏమయ్యా!నెయ్యి తక్కువగా ఉంది. మొహిరీలు లేవు. " ధీమాగా శివయ్య అన్నాడు "అవును నెయ్యి కాచాను.ఇంట్లో వాళ్ళు అందరూ రుచిచూశారు."మిగతా ముగ్గురు "మీరు ఇచ్చింది ఇచ్చినట్లుగా తెచ్చాము.వెల మాఅందరిదీ ఒకటే" అన్నారు. "శివయ్యా!ఇందులో రెండు మొహిరీలు ఏవి?" "నేతిడబ్బాల్లో మొహిరీలు ఉంటాయా?" మిగతా ముగ్గురు కూడా "అవునవును"అన్నారు.న్యాయాధికారి ఇలా అన్నాడు "నేను కావాలనే శివయ్య రామయ్య డబ్బాలలో రెండు మొహిరీలు వేశాను.రామయ్య డబ్బా అడుగున ఇదిగో చూడండి ఈరెండుమొహిరీలు!ఈరెండు డబ్బాలలో వేయలేదు "అని అందరితో కలిసి శివయ్య ఇంటికి వెళ్లాడు.శివయ్య భార్యను పిలిచి"అమ్మా! నేతి డబ్బాలో రెండు మొహిరీలు ఉండాలి. నామనవడు ఆడుతూ అందులో వేశాడు.తీసుకుని రాఅమ్మా!" అన్నాడు. ఆమె వెంటనే తెచ్చి అంది"అవునండీ!నెయ్యి కాస్తుండగా అవి కనపడితే మాఆయన తీశారు "అని తెచ్చి ఇచ్చింది. "శివయ్యా!రెండు మొహిరీలు నెయ్యి కాజేసిన నీవు రామయ్య దగ్గర తీసుకున్న వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టాలని చూశావు.నీది అంతా కల్తీ దొంగ వ్యాపారం అని రోజు జనాలు మొత్తుకున్నా వినిపించుకోలేదు."అని శివయ్య కి ఓనెల కారాగార శిక్ష వెయ్యి మొహిరీల జరిమానా వేశాడు.రామయ్య కి అతని ఐదొందల మొహిరీలు ఇచ్చేశాడు.పూర్వం అంతా అలా నీతి నిజాయితీగా బతికారు.ఇదంతా మన తాత ముత్తాతల కాలంలో!మరి చదువు పేరు తో మనకి అతితెలివి పెరిగి అన్యాయం అక్రమాలు చేయడం మామూలైంది.🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి