అమ్మానాన్నలు ఎవరో ఏమోతెలియనే తెలియదు మాకుమా కష్టాలెవరితొ చెప్పుకోవాలోతెలియనే తెలియదు మాకు!ఆకలి కడుపుతో మాడేవారురోడ్డుమీది ఈగల మాదిరిపెంటమీది చెత్తమాదిరిఎవరిపిల్లలమో ఏమో ఏమో!వానకు తడిసిన, ఎండకు ఎండినచలికి వణికిన, గాలికి ఒరిగినఎడారి ఒంటెలం అవునో ఏమోఎవరిపిల్లలమో ఏమో ఏమో!కడుపు నొచ్చినా, కాలు నొచ్చినాజొరం వచ్చినా, రోగం వచ్చినాకుక్క చావు చస్తాముఎవరిపిల్లమో ఏమో ఏమో!ఎవరో చేసిన తప్పుడు పనులకునిజమైన సాక్షం మేమే మేమేరోడ్డునపడ్డ మా బాల్యంతోభావిభారతం ఏమౌనో ఏమో?!
అనాథ బాలలు (బాలగేయం):;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి