ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు అన్న ఆటవెలది చెప్పమంటే వేలిముద్ర వాళ్ళు కూడా చెప్పగలరు. ప్రజల నాలుక పై నిలిచి వున్నాయి వేమన పద్యాలు. పద్యాలయితే వచ్చు కానీ దాని అర్థాలు పండితులకైనా తెలుస్తుందా? చూడ చూడ రుచుల జాడ వేరు అని చెప్పిన వేమన మనసు అర్థం చేసుకున్న పండితులు ఎంతమంది ఉన్నారు? రుచికి మార్గం ఉంటుందా ఉప్పు జాడ వేరు కప్పురం జాడ వేరు అని చెప్తున్నారు మనకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా చెప్పలేదు. దానికి కారణం వారి గురువు గారు వారికి చెప్పి ఉండకపోవచ్చు. ఒక చేతిలో ఉప్పును మరొక చేతిలో కప్పురాన్ని పెట్టుకొని ఎండలో నిలబడితే సూర్య కిరణం ఉప్పు మీద పడి 45 డిగ్రీల పరావర్తనం చెందుతుంది. కప్పురం మీద సూర్య కిరణం పడితే 90 డిగ్రీల పరావర్తనం చెంది ప్రయాణం చేస్తోంది. ప్రయాణం చేయడంలో దాని మార్గం వేరు, దీని మార్గం వేరు అని చెప్పడం వేమన గారి మనసులోని అభిప్రాయం. రుచుల జాడ వేరు అన్న దాంట్లో రుచి అన్న శబ్దానికి టేస్ట్ అనేది అందరికీ తెలుస్తుంది కానీ రుచి అంటే వెలుగు సూర్యకిరణం అని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే దానిలో ఉన్న అసలు అర్థాన్ని ఎవరు బయటకు తీయలేక పోతున్నారు. వాల్మీకి మహర్షి రామాయణంలో ధర్మాన్ని చెప్పడం కాకుండా ధర్మ సూష్మాన్ని కూడా చెప్పడం మనకు తెలుసు. సాహిత్యం అంటే వాల్మీకి మహర్షి, ఆ తర్వాత మహానుభావుడు వ్యాసమహర్షి, ఆ తర్వాత ఏ కవి అయినా సాహిత్యాన్ని గురించి రాశాడా? కాళిదాసు లాంటి మహానుభావులు కూడా రసాత్మకమైన కవితలను సారస్వతం చేయడం తప్ప సాహితీ విలువలతో రాయలేదు. వాంగ్మయం, సాహిత్యం, సారస్వతం అని మూడు భాగాలు చేసి పెద్దలు మనకు చెప్పారు. అర్థం తెలిసి చేసినా, తెలియక చేసినా నాలుగు మాటలు కలిపి రాస్తే అది వాంగ్మయం. కాళిదాసు లాగా నవరసాలను పొందుపరిచి రాస్తే సారస్వతం అంటాం. ఆదికవి వాల్మీకి, వ్యాస మహర్షి వ్రాసిన దానిని సాహిత్యం అంటాము. వారికి దీటుగా చెప్పిన కవి వేమన మాత్రమే అందుకే ఆ పద్యాలు శాశ్వతంగా ఉన్నాయి.
మీ బుధజన విధేయుడు
ఏ.బి ఆనంద్ఆకాశవాణి.
మీ బుధజన విధేయుడు
ఏ.బి ఆనంద్ఆకాశవాణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి