మార్గదర్శనం ..!!;- -- సరళ శ్రీ లిఖిత హైదరాబాద్

 తొలి చిగురులతో
మామిడి, వేప పూతలతో
ఆమని కోయిల కూతలతో
మల్లెల పరిమళాలతో
తెలుగు సంవత్సరాది 
'యుగాది'
పండుగ వచ్చేనే
మామిడి తోరణాలతో
మన జీవిత సుఖదుఃఖాలు
మిళితమైన షడ్రుచుల
ఉగాది పచ్చడి -భక్ష్యాలతో
నైవేద్యం సమర్పించి 
పూజాలు చేసి
పంచాంగ పఠనం చేసి
భవిష్యత్తు ఏమిటా? అనే ఆశతో
సరి-భేసిలు 
భేరిజు వేసుకుంటూ
రేపటి ఆశల రూపం 
కలల సౌధాలు కట్టుకొని
సాకారం చేసుకోవడానికై
సాగిపో మానవా 
ఇక--
జీవిత గమనంలో
తొలి *ఉషస్సులా -
ఉగాది* గా..!!
               ***

కామెంట్‌లు