వీడని ఆటవికం (చిత్రకవిత) కోరాడ నరసింహా రావు !
సామెతలు ఊరకే పుట్టాయా, 
ఎన్నెన్ని అనుభవాల సారమవి!

అలువుడ్ని బలువుడు, బలు వుడ్ని...ధన,అధికారమదమున్నవాడూ...అనాదిగా వస్తున్న 
ఆటవిక న్యాయం... తరాలు కాదు,యుగాలే గతించిపోయి నా ఏమాత్రమూ మారని తీరు!

ఆ నరుడు, నవ నాగరికుడుగా
రూపంలోనే మారాడు !
    ఆగుణాలనింకా పోగొట్టు కో 
లేకపోతున్నాడు !!
  తనమేధస్సును మరిన్ని కుత్సి
తాలకు,బహుచక్కగావినియోగిం చుకుంటున్నాడు !
 
   బలమైనవారు బలహీనుల్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవా లనుకోబట్టే... ఈ ఉక్రెయిన్ యుద్దాల్లాంటివి !!
అధికార దాహం... ఎంతటి మారణహోమానికైనావెనుకాడ దన్నది...  చరిత్ర పలుమార్లు ఇస్తున్న సాక్ష్యం !
    ఈ ప్రపంచానికి కావలసింది వినాశకర విజ్ఞానంకాదని శాంతి కాముకఉపదేశమని...ఇప్పటికీ 
ఈమనుషులకు బోధపడటం 
లేదు !!
     *******

కామెంట్‌లు