ప్రేమ -ప్రేమను ,ప్రేమిస్తుంది ...!!;-----డా.కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ.
ప్రేమను -
ప్రేమగా
పొందలేకపోవడం ,
కొందరి దౌర్భాగ్యం !

దురద్రుష్టంకాటేసి
ప్రేమనుపొందే 
అవకాశం 
లేకపోవడం 
వాళ్ళనుదుటి వ్రాత !

ప్రేమించే -
వయసుకాకపోవడం
అయినా--
ధైర్యంలేకపోవడం ,
సామజిక స్పీడ్  బ్రేకర్  !

ఇవన్నీ కలగలిపి ,
ప్రేమంటే ...
హాస్యంగాను ,
ప్రేమను -
పని-పాటాలేనివాళ్ళ ,
ఊతపదంగానూ 
భావిస్తారుకొందరు !

అయినా ....
ప్రేమ ..అనేపదం 
ఉచ్ఛరించకుండా 
బ్రతకలేరువాళ్ళు ...!!

              ***      

కామెంట్‌లు