సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 దూరంగా... భారంగా..
*******
ఆవేశంగానో, అనాలోచితంగానో ఏదో ఒక అసంతృప్తి కి లోనవుతూ.. కష్టపెట్టే వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటేనే మంచిది.
పిల్లి మీదో, కుక్క మీదో నెపం పెట్టి నిత్యం మాటలతో, చేతలతో బాధించే మూర్ఖత్వం నిలువెల్లా నిండిన వారికి, నిజంగా దూరమైతే తప్ప మనిషి విలువ, మనసు విలువ తెలియదు.
అల్లుకున్న బంధాలతో ఆనందంగా జీవించడం మరిచి, ఆ బంధాన్ని భరిస్తున్నామనే భావనను ప్రతిసారీ వ్యక్తం చేసే వారితో బంధాన్ని కొనసాగించడం కంటే ...
బంధం విలువ తెలిసేలా చేయడం ముఖ్యం. 
అలాంటి వారిని భరిస్తూ జీవించడం అతి కష్టం.
దుఃఖాన్ని దిగమింగుకుంటూ రోజూ నరకయాతనతో బతకడం కంటే,
భారమనుకున్న వారికి దూరంగా, ప్రశాంతంగా ఉంటేనే మంచిది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు