బిగడంతా వాకిలి జూసి
బిరబిరా ఊడ్చేసు అమ్మ
సానుపేమో చల్లేసు అవ్వ
ముత్యాల ముగ్గులేసు అక్క
గుమ్మము ముందున్న
గడపకేమొ పసుపురుద్ది
కుంకుమ బొట్లను పెట్టమ్మ
ఆ గడుప మా ఇంటి లక్ష్మి
పేడ ఎర్ర మట్టి కలిపి
ఇల్లు అంత అలికి పెట్టి
ముత్యాలముగ్గు లేసిన
ఆ ఇల్లెంతో అందంగుండు
పొయ్యిలోన మంటపెట్టి
పొయ్యి మీద కుండ బెట్టి
అందులోన అన్నమొండి
అందరికి వడ్డించు అమ్మ
పెరిటి లోన నాటెదరు
కాయగూర చెట్లెన్నెన్నో
కోసివండి పేట్టు అమ్మ
కూర ఎంతో కమ్మగుండు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి