మల్లె (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
మా ఇంటి పెరటిలోన 
మల్లెపూల తీగెనండి 
పందిరంత తీగెనండి 
అల్లుకుంది చూడరండి!

పచ్చటి ఆకుల నడుమ 
తెల్ల తెల్లటి పూలండి 
పూలంటే పూలు కావు 
మల్లెతీగె నవ్వులండి!

ఆకాశంలో నుండి 
జారిపడినవేమొనండి 
తీగెనిండ చుక్కలోలె 
మల్లె పూలు సుమండీ !

చక్కనైన వాసనతో
అందమైన పూవులండి
పూలన్నీ మాలలల్లి
దేవుడిమెడలో వేయరండి!!


కామెంట్‌లు