రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం లో ప్రముఖ కవి " కావ్యసుధ " కు ఉగాది పురస్కారం

 అరిగ పూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుందరయ్య కళా భవన్ బాగ్లింగంపల్లి, హైదరాబాదు లో శ్రీ శుభకృత్ నామ ఉగాది సందర్భంగా రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం, సుప్రసిద్ధ కవి సినీ గేయరచయిత, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్జీవోస్ నెట్వర్క్, నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షుడు, సభా మహా సామ్రాట్ శ్రీ బిక్కి కృష్ణ గారి అధ్యక్షతన లో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం రసరమ్యంగా షడ్రుచుల మిళితమై రాగరంజితంగా సాగింది.
       ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ డాక్టర్. సుధారాణి గారు విచ్చేసి హైకోర్టు పూర్వ జస్టిస్ శ్రీ చంద్ర కుమార్ గారు రచించిన "వినరా కుమారా ! వివరించి నే చెబుతా" కావ్యాన్ని ఆవిష్కరించారు. గౌరవ అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్ శ్రీ మసన చెన్నప్ప గారు, ప్రత్యేక అతిథిగా  సీనియర్ జర్నలిస్ట్ టీవీ 5, శ్రీ రాజేంద్ర,గారు,
తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు,విమర్శకులు ప్రముఖ కవి శ్రీ కాళేశ్వరం శంకరం ప్రభృతులు పాల్గొన్న సభలో ప్రముఖ కవి, ఆధ్యాత్మిక వ్యాస రచయిత,
సీనియర్ జర్నలిస్ట్,  "కావ్యసుధ" ను ఉగాది పురస్కారం, శాలువా మెమొంటో ప్రశంసాపత్రంతో సన్మానిస్తున్న తెలంగాణ రాష్ట్ర పూర్వ జస్టిస్ శ్రీ బి చంద్ర కుమార్ గారు... చిత్రంలో సుప్రసిద్ధ కవి శ్రీ బిక్కి కృష్ణ ప్రభృతులు ఉన్నారు. మూడు గంటల పాటు జరిగిన సభ విజయవంతంగా జరిగి  ముగిసింది.
కామెంట్‌లు