గున్న మామిడి - గుటకలేయిస్తుంది ;- ఎం. వి. ఉమాదేవి

 సారవంతమైన నేలతల్లి అందించే ఫలం 
గున్నమామిడికే గుత్తులుగా కాయలు 
కోసుకోమని వినయంగా వంగడం... 
తరువు గొప్పతనాన్ని చూపుతుంది 
వాననీటితోనే వనదేవతల ఆశీస్సులు 
పూత పిందె కాయల పుణ్య ప్రకృతి ఆవాసాలు !
గోరుతో గిచ్చితే ఘుమఘుమలే 
పచ్చడి కాయల ఆచూకీనిస్తాయి 
అప్పటికప్పుడు ఆవకాయ, తురుముపచ్చడి..సరే 
ముక్కలు ఊరబెట్టి ఎండనుంచి తీసిరసం అదృశ్యమైనాక 
కలిపే మాగాయ్ పచ్చడి... 
వర్షాల్లో ఆదుకుంటుంది !
టెంకపారెయ్యలేం, అలాగని మింగేయ్ లేం... 
చద్దన్నం, పెరుగన్నం లో మాగాయ, మామిడిపండు... 
ఆ రుచి స్వర్గానికి బెత్తెడు దూరమే !!
కామెంట్‌లు
Unknown చెప్పారు…
బాగా చెప్పారండీ గున్నమామిడి గురించి