*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౭౦ - 070)
 *పరోపకార పద్ధతి*
చంపకమాల:
*హృదయవచశ్శరీరముల నెంతయుఁబుణ్యసుధాపూర్ణులై*
*ముదము బహూపకారములు మూఁడుజగంబులకున్ ఘటించుచున్*
*వదలక సాధుసద్గుణుల వంబుల గొండలు సేసి మెచ్చుచున్*
*మదిని వికాసయుక్తు లగు మాన్యులు గొందరు వొల్తు రిద్దరన్*
*తా:*
ఈ భూమి మీద మనసు, మాట, శరీరము లతో మంచిపనులు చేయడం అనే అమృతము తాగిన మంచివారు ఎదుటి వారిలో పక్కవారికి సహాయ పడాలి అనే చిన్న అలోచన కనిపించినా మనసులో ఎంతో సంతోషపడే వారు చాలా కొద్దిమంది మాత్రమే వుంటారు............ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*ఒక బలి చక్రవర్తి, ఒక కర్ణుడు మొదలగువారు జీవితంలో ప్రతీ క్షణమూ ఎదుటి వారికి మంచి చేయాలి అని మాత్రమే ఆలోచిస్తూ వుంటారు. ఈ మార్గంలో వెళుతున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా తమ పరోపకార వ్రతాన్ని వదలలేదు. అందరి కంటే కూడా నారదమహర్షి. ఈ మహర్షి చేసే పనులు, మాట్లాడే మాటలు అన్నీ పరోపకారం కోసమే. కానీ, ఈ మహామునిని ఎల్లప్పుడూ అందరూ అపార్థం చేసుకుంటూనే వుంటారు. ఇటువంటి పరోపకార పరాయణుల మధ్య మన జీవితం వెళ్ళ బుచ్చే సదవకాశం అపరమాత్మడు మనకందరకు కలిగించాలని ఆ త్రినేత్రుని త్రికరణ శుద్ధిగా వేడుకుంటూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు