"నీ జ్జాపకం నాతోనే "1980(ధారావాహిక 16,పభాగం)-"నాగమణి రావులపాటి"
 కుసుమ గదిలోనుండి బయటికి వచ్చింది ఇంతలో
బయట గేటు దగ్గర రాహుల్ ఫ్రెండ్స్ తో కనిపించాడు
చాలా అందంగా తయారై వచ్చాడు బ్లాక్ పేంట్
వంకాయ కలర్ షర్ట్ ఇన్సర్ట్ వేసాడు చేతికి వాచ్
కుడి చేతికి braceiet పెట్టుకుని మెడలో చైన్
వేసుకుని చాలా చాలా అందంగా వున్నాడు ఉంగరాలు జుట్టు అందాన్ని ఇంకాస్త పెంచింది
ఎప్పుడూ మీసాలు తిప్పుతుంటాడు  
చూపు తిప్పుకోలేక పోయింది కుసుమ
రాహుల్ ఎంత అందంగా వున్నాడు అని తెగ
మురిసి పోయింది కుసుమ
అంతలోనే ఏమిటీ ఇలా వచ్చాడు నన్ను ఫాలో
అయి నేను పెళ్ళికి వచ్చానని తెలిసి వచ్చాడా
లేకపోతే పెళ్ళికొడుకు రాహుల్ ఫ్రంట్ ఏమో
నాకోసం వేస్తే నాకోసం వెతకకుండా అక్కడే
ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఎందుకుంటాడు
ఏది ఏమైనా నన్ను చూస్తే పలకరిస్తే అమ్మా
వాళ్ళు చూస్తే ఏమయినా వుందా దేవుడా
ఏమిటీ నాకీ పరీక్ష నేను కంటపడకుండానే
 తిరుగుతా అని కాస్త చాటుగానే కూర్చుంది
ఇంతలో రాహుల్ హాలులో అడుగు పెట్టాడు
కుసుమ అమ్మగారు చెల్లెలు తమ్ముడు ఒక చోట 
కూర్చున్నారు నాన్నగారు దూరంగా బంధువులతో
కబుర్లలో పడ్డారు కుసుమ వాళ్ళు అమ్మగారిని
ఒకావిడ పలకరించింది ఏదీ మీ పెద్దమ్మాయి
ఎప్పుడో చిన్నప్పుడు చూసాను  అని కుసుమ
గురించి అడుగుతోంది అమ్మకుసుమా ఇటు
రావే ఒకసారి అత్తయ్య పిలుస్తోంది నిన్ను 
చూస్తుంటే అని పిలిచేసరికి కుసుమ అనే
పదం విని చివాలున తలతిప్పి చూసాడు
కడిగిన ముత్యంలా మెరిసిపోయే కుసుమను
చూసాడు రాహుల్ తనేనా ఎంత అందంగా వుంది
అప్సరసలు కూడా నా కుసుమ ముందు
దిగదుడుపే అరే తాను వెళతానని తనది
ఈ పెళ్ళికేనా పెళ్ళికొడుకు నాఫ్రండ్ రమ్మని
వాడు రమ్మని తెగ గొడవ చేస్తే వచ్చాను 
అదీ కుసుమ కలవటానికి కుదరదు అని చెప్పింది కాబట్టి తాను ఎలాగూ రాదు కదా అని వీడి
పెళ్ళికి వచ్చాను అనుకోకుండా ఓకే గూటి
పక్షుల్లా భలే కలిసాము అని తెగ సంబర 
పడిపోయాడు
కుసుమ రాహుల్ నీ చూసి కూడా చూడనట్టు
తల వంచుకుని ఏమిటమ్మా పిలిచావు అని
అంటూ వాళ్ళు అమ్మ దగ్గరకు వెళ్ళింది
కుసుమ ఏమీలేదే ఈవిడ నీకు అత్తయ్య
అవుతుంది నిన్న చూడాలంటే పిలిచాను
రా ఇలా కూర్చో అని అనేసరికి కూర్చుండి
పోయింది కుసుమ ఇంకా రాహుల్ అయితే
తనను చూడాలని పదే పదే తిరుగుతున్నాడు
ఇంతలో ?(సశేషం)తరువాత బాగం రేపే

కామెంట్‌లు