మణిపూసలు(ఓట్లు -నోట్లు );-పోతుల చైతన్య భారతి 7013264464
 1.
డబ్బుతొ కొంటున్న ఓట్లు 
ప్రజాస్వామ్యానికి తూట్లు 
మత్తులొ కునికిపాట్ల ప్రజలు 
మత్తు దిగితె మొత్తం పాట్లు 
2.
నోట్లు మాకు ఓట్లు మీకు 
ఆశల హామీలు మాకు 
అందలాలన్ని మీకా !
 స్వాతంత్ర్యం స్వార్థాలకు 
3.
అప్పుడు విదేశీయులు 
ఇప్పుడూ స్వదేశీయులు 
చేతులు మారెను పాలన 
దోపిడీ సమ ఉజ్జీలు 
4.
నాడు ప్రజలె పిల్లలు 
నేడు పిల్లలె ప్రజలు 
ప్రజాతీర్పులు మారాలి. 
ఎదిగారు నాయకులు. 
5.
విద్య, వైద్యంలొ మార్పులు 
కోరుకోవాలి ప్రజలు 
ప్రశ్నించాలి అందరు 
ఎక్కుపెట్టు ఆయుధాలు

కామెంట్‌లు