-కడు మోదము('క 'ప్రాసాక్షర బాలగేయం;-పోతుల చైతన్య భారతి(చైతన్య--7013264464
కలలు కనే కనులందo
కమలాలన అరవిందం 
కరినెక్కుట ఆనందం 
కమలాలు ఆమోదం 

కనులతోనే చూసొద్దాం 
కమనీయం దోచేద్దాం 
కవనాలను రాసేద్దాం 
కలం గళం చూపిద్దాం 

కన్నీరు తుడిచి పెట్టు 
కర్తవ్యం మొదలెట్టు 
కసితోనే ఉడుం పట్టు 
కనిపించు కీర్తిమెట్టు 

కలిమిలోన మరిచిపోకు 
కన్నవారి నొదిలేయకు 
కల్లలతో  దోచుకోకు 
కడలిలోన ముంచబోకు 

కత్తిలాంటి మాటలొద్దు 
కంచెలాంటి దూరమొద్దు 
కరుణ ఉంటెకడు ముద్దు
కడవరకు ముదము కద్దు 

కరుకుదనం వదులుదాం 
కనికరాన్ని  చూపుదాం 
కరముకరము కలుపుదాం 
కష్టాలను వదులుదాం


కామెంట్‌లు