మాయ....;-ప్రమోద్ ఆవంచ 7013272452

 తియ్యని బాధ మధిలో మొదలైంది
దానితో కొంచెం సంతోషం చేరి కళ్ళు
చెమ్మగిల్లాయి.
ఒక ఊహ శరీరాన్ని వేడి పుట్టిస్తుంది
ఆ తాపం జ్ఞాపకాలను తడుతుంది
చల్లని జల్లు తుంపరలు తాకి ఇట్టే మాయమవుతున్నాయి
ఆ స్పర్శకు నా గుండె చప్పుళ్ళు నాకే
వినిపిస్తున్నాయి
ఆ కళ్ళేపుడూ మాట్లాడుతూనే వుంటాయి
నా మౌనాన్ని ప్రశ్నిస్తూనే వుంటాయి
మాటలెపుడూ చినుకులల్లే ఆహ్లాదంగా వుంటాయి
మౌనమంతా ఎన్నో అర్ధాలను పలుకుతుంది
కాలమెపుడూ పరిక్షిస్తుంది, కలలన్నీ అదృశ్యమై
విహరిస్తుంటాయి
మనసంతా వెన్నెల పరుచుకుంది
వెలుగుతో సాన్నిహిత్యం పెరుగుతుంది
సాహిత్యం పదమై పాడుతుంది
నీడలు కథలై వెంట పయనిస్తున్నాయి
కడలి తరంగం తీరాన్ని తనివితీరా తాకింది
ఆకాశాన్ని నల్లని మబ్బు కమ్మింది
మసక చీకటిలో కలువ తడిచేందుకు సిద్దం
అయ్యింది
చినుకు చినుకు ఒకటైయ్యాయి, తనివితీరా
తడిసిపోయాయి
ఆనందం అంబరమై ఆకాశాన్ని అంటింది
చుట్టూ వెలుగులే, కళ్ళల్లో జిలుగులే, దారంతా
మల్లెలే, జీవితమంతా రంగులే, రంగవల్లులే!
                                      
కామెంట్‌లు