బాల మొగ్గలు;\\---కయ్యూరు బాలసుబ్రమణ్యం 7780277240
బాలలు పువ్వుల్లా విరిసి పరిమళాలు వెదజల్లితేనే
చదువులమ్మ మురిసి అక్షరాలతో పలకరించేది
దేశ ప్రగతికి పట్టుగొమ్మలు బాలలు

పిల్లలు కిలకిల మని రావాలతో సందడి చేస్తేనే
గురువుల మది పులకరించి పాఠాలతో సంసిద్దులయ్యేది
పాఠశాలలో అలరించే పుత్తడిబొమ్మలు పిల్లలు

చిన్నారులు అమర వీరుల కధలు వింటేనే
దేశ భక్తి పెరిగి జాతీయ సమగ్రతకు వారధులయ్యేది
భారత మాత మెడలో హారాలు చిన్నారులుకామెంట్‌లు