హనుమాన్ జయంతి సందర్భంగా;-మమత ఐలకరీంనగర్9247593432
 క.
సీతాన్వేషణ పరుడై
దూతగ యంబుధిని దాటి తొక్కెను లంకన్
కోతై వనమునవెతకగ
మాత యకట కానవచ్చె మారుతి కపుడున్
క.
తల్లీ!యని ప్రణమిల్లుచు
మెల్లగ తన చెంతజేరి మృత్యుంజయు డా
మల్లిక బాధనుగనగన్
మల్లీ రక్కసుడనుకొని మరి భీతిల్లెన్
క.
అమ్మా! గమనించు మనుచు
కొమ్మకు దైర్యమును జెప్పి కోమల హృదికిన్
నెమ్మదిగా జూపించెను
నమ్మదగిన యుంగరంబు నాత్రుత తోడన్
క.
రాముని ముద్రిక గనుచున్
ధీమత జెందిన తదుపరి దివ్యపలుకులన్
కోమలి యడుగగ జెప్పెను
రాముని క్షేమంబునంత రమణికి హనుమాన్

కామెంట్‌లు