ప్రజాకవి వేమన ; ఏ.బి ఆనంద్--ఆకాశవాణి.94928 11322
, కవిత కానీ, పద్యం కానీ రాసిన కవి చిరకాలం  ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉంటాడు.  శ్రీ శ్రీ, కారా మాస్టారు,కాళోజీ  లాంటి వారి రచనలను ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటాం వారిలా ప్రజాకవిగా పేరుపొందిన వాడు వేమన. మీ నివాసం ఏమిటి, మీరు ఎక్కడ ఉంటున్నారు  అని అడిగిన వాడికి ఆ శబ్దానికి అర్థం తెలియాలి నివాసం అంటే వేంకటేశ్వరస్వామి ఏడు కొండల పైన ఉన్నట్లు సొంత ఇంట్లో ఉండేవారిని నివాసి అంటారు అద్దె ఇంటిలో ఉండేవాడిని వాసి అంటారు.  దానికి వేమన ఏమని సమాధానం చెప్పాడు ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి  అని. కానీ అడిగిన వాడికి దాని అర్థం తెలియదు కదా అతనికి ఏమని అర్థం అయింది  కొండవీడులో పశ్చిమ భాగాన ఉంటున్నాడు అని. కానీ లోతైన అర్ధం ఏమిటి వేమన చెప్పదలచుకున్నది?
విస్తృత అర్థానికి వెళితే శుద్రాము నుంచి బ్రాహ్మణ్యానికి వెళ్ళే మార్గానికి చింతపల్లి మొదటి మెట్టు అంటాడు వేమన. శరీరానికి ఊరు అంటే నితంబం, తొడ ప్రధానం. అదే శరీరం మొత్తాన్ని మోస్తుంది దానిని ఆధారం చేసుకొని మానవ శరీర నిర్మాణం మొత్తం ఏర్పడుతుంది. తూర్పున ఉదయించే సూర్యుడు పడమరన అస్తమించినట్లు  ప్రతివాడు ప్రయాణం చేయడం శారీరక ధర్మం జాతస్యహిః ధృవో మృత్యుః అన్నది గీతా వాక్యం దీనినే జగద్ వ్యాపారం అంటున్నాం. పుట్టుట, గిట్టుట, మరణించుట, చనిపోవుట ఇవి సహజం మరణించడానికి, చనిపోవడానికి చాలా తేడా ఉంది. "మ" అంటే ప్రణాళికాబద్ధమైన అని అర్థం 
"రణం" అంటే యుద్ధం కను మూస్తే మరణం కను తెరిస్తే జననం అన్నట్లుగా తెల్లవారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంతవరకు చేసే ప్రయాణం మరణం.
దీనిని గురించి చింత అనగా ఆలోచన మొదలు పెడితే అది నోరు మెదపకుండా మెదడుకు మేత, ఆలోచన ఎక్కువ చేస్తుంది. పరిశీలనా దృష్టి పెరగాలి దానికి స్థానాలు అడవులు, ప్రకృతి, ఏకాంత ప్రదేశాలు మన పల్లె అయితే మరీ మంచిది. పల్లె పట్టు అని చెప్తాము పల్లె రమ్మని ఆహ్వానిస్తుంది పట్టణం తెమ్మని ఆదేశిస్తూ ఉంటుంది  ఎంత తెచ్చినా తృప్తి ఉండదు అక్కడ పెట్టు అంటుంది. ఇక్కడ పల్లెపట్టుల్లో పట్టు ఎంతో అర్థవంతమైనది, అవసరమైనది అంటే అక్కడ స్థానబలం ఉంటుంది కదా కనక మన జీవనం హాయిగా ఉంటుంది. మనం పుట్టిన పల్లెల్లో, మరొకటి పట్టుబట్ట. దానిని కట్టి వడ్డనలు కానీ వంటగదిలో స్త్రీలు ధరించే బట్టలు కానీ పట్టులో ఉంటుంది. దాని ప్రాధాన్యత ఏమిటంటే వడ్డనలయితే మనకు కీడు కలుగజేసే క్రిములను ఇది చంపుతుంది  వంట చేసేటప్పుడు పొరపాటున చీరకు నిప్పు అంటుకుంటే బెజ్జం పడుతుంది  తప్ప మండదు. కనుక  అటు ఆరోగ్యాన్ని ఇటు ప్రాణాన్ని కాపాడేది పట్టు వస్త్రం.  చివరిది తినే పట్టు తేనె పట్టు నవ రుచుల సమ్మేళనం ఎంత హాయిగా ఉంటుందో అందరికీ తెలుసు. దీనిని మొదటి మెట్టుగా స్వీకరిస్తే ముని స్థితినుంచి ఋషి మహర్షి, రాజర్షి, వేదర్షి తత్వాలను దాటుకుంటూ వశిష్ఠులవారి వంటి మహర్షి స్థితికి చేరుకుంటాము అక్కడ నిలబడి చూస్తే ఈ కుల, మత, వర్గ, వర్ణ భేదాలకు అతీతంగా కనిపిస్తుంది ఈ రాజస రెడ్డి శబ్దం. అందుకే వేమనామాత్యులు అంత గొప్ప వేదాంతిగా పేరు పొందారు. 


కామెంట్‌లు