యమపాశం;-గుండాల నరేంద్రబాబు అసోసియేట్ ఎన్.సి.సి.ఆఫీసర్, ;-సెల్: 9493235992.
పల్లవి:
 
అందాల జీవితం చేసుకోకు వ్యర్థం బంగారు భవితవ్యం చేసుకో ధన్యం
పొగ తాగడమంటే పాడినే  ఎక్కడం
పొగ తాగడమంటే ప్రాణాలే అర్పించడo

అనుపల్లవి:
 పొగ తాగడమంటే ఆయుష్షే తగ్గడం
 పొగ తాగడమంటే ఆదాయం తరగడం 
 పొగ తాగడమంటే వ్యసనాలకు బానిసే కావడం
 పొగ తాగడమంటే కుటుంబాన్నే వీధుల పాలు చేయడం

చరణం:1

చుట్టలే తాగకు కష్టాలే తెచ్చుకోకు 
గుట్కాలే తినకు గుటుక్కు మనబోకు
గంజాయే పీల్చకు గబుక్కున పోమాకు
పాన్ మసాలే నమలకు పైకే పోబోకు
బీడీలే తాగకు బొగ్గల్లే మారకు
ఖైనీలే వేయకు ఖైమాగా మారకు
తంబాకే కాల్చకు తగలబడి పోకు
ధూమపానమే చేయకు క్యాన్సర్ బారిన పడకు

చరణం:2

సిగరెట్లే తాగకు చిత్తుగా ఓడకు 
జరదాలే నమలకు నగుబాటే గాకు
 కారా కిళ్ళీ వేయకు మత్తులో జోగకు
పొగాకే నమలకు  పొగ బారిపోకు
ముక్కుపొడి పీల్చకు చిక్కుల్లో పడబోకు
పొగాకు జోలి కెళ్లకు రోగాలే తెచ్చుకోకు
పొగాకే వాడకు
ఇల్లు ఒళ్ళు గుల్ల చేయకు
పొగరాయుడిగా మారకు యమపురికే చేరకు


(మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాయబడిన గీతం)


గుండాల నరేంద్రబాబు అసోసియేట్ ఎన్.సి.సి.ఆఫీసర్, ;-సెల్: 9493235992. 
10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్.సి.సి నెల్లూరు


కామెంట్‌లు