చిటికెన వేలు పట్టి నడక నేర్పిన శక్తి నాయినే,నా చిన్నతనంలో
ఇప్పుడు
వృద్ధోపనిషద్ కావ్యం తిప్పేస్తున్న
ఆ వేళ్ళకు
లేలేత చేతి వేళ్ల స్పర్శ తాకాలి
నడక కొత్త శక్తిగా వెలిగినదే
ఆసరా నాయినకు
అక్షరాల్లో సృజన వెల్లువ
కాగితాలపై చీమల బారు అక్షరాలు
రాసిన కలంలో పుట్టిన కావ్యశ్వాసలెన్నో
ప్రయోగాల కొత్తదనం కన్నావా కవిత్వ వృక్షంలో ఏనాడైనా
సాంప్రదాయాల వేళ్ళు ఒరుసుకునే
పచ్చని కొమ్మల సన్నాయి విన్నావా
ఆకుల ఆకుపచ్చని రంగు అందాలు
నిన్నటి ఆకాశం ఊగిన సుగంధం
ఎర్రటి రంగులో రక్తం ప్రవహిస్తుంది రేపటి ఆశల అవనిలో స్వేచ్ఛ కోరి
నేడు గడుస్తుంది
నిన్నటి రేపటి వెలుగు వంతెనలా
నిన్నూ నన్నూ కన్న చూపుల నిచ్చెనలో
కానీ
నీవూ నేనూ వేరువేరు కాదు
నీలో నేనై నాలో నీవైన వలయంలో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి