కర్మ ఫలము! "శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
   👌 "ఫలము" అనగా పండు
     మనకర్మల "ఫలితము"
     కలిగెడు "ప్రయోజనము"
          శంకర ప్రియు లార!
    (..శంకర ప్రియ పదాలు., )
👌"ఫల"శబ్దమునకు..  కాయ, పండు, ప్రయోజనము, బాణాగ్రము.. అని, నానార్ధములు!
     "ఫలతీతి ఫలం".. యనెడు అమరకోశం నిర్వచనము ననుసరించి; "పుట్టునది", "లాభించునది".. అని, విశేషార్ధములు!
👌ఆరాధకులమైన, సాధకులమైన మనమంతా.. తెలిసీ, తెలియక ఆచరించిన; సత్కర్మలు వలన.. "పుణ్య ఫలము";  దుష్కర్మలు వలన.. "పాప ఫలము" లను అనుభవించు చున్నాము! ఇది.. యథార్థ సత్యము!
     ⚜️తేట గీతి
    "ఫలము" భక్షించు వారికి, బ్రతుకు లోన
     "కోరికలు పండు", సంపదల్ చేరుచుండు,
     "కాల ఫలము"ల భక్షించి, గనుడు శుభము,
     ఫలము లారగించిన వారి "బ్రతుకు పండు"!
(రచన: డా. అయాచితం నటేశ్వర శర్మ., )

కామెంట్‌లు