బహుముఖ ప్రజ్ఞాశీలి;--అయ్యలసోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం--చరవాణి:-9963265762
మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవిల నోము పంటగా పదునాల్గవ సంతానంగా కలకత్తా లో జన్మించిన రవీంద్రనాథ్ ఠాగూర్  బాల్యం నుంచే సాహితి మక్కువచే            " సంధ్యాగీత్" అనే సామాజిక స్పృహ కలిగిన కావ్యాన్ని రచించి ప్రసిద్ధి గాంచెను .........!!

"గీతాంజలి" రచన కి ఆసియాలోనే మొదటి నోబెల్ పురస్కారం పొంది విశ్వకవిగా జాతిపిత గాంధీ మాహాత్ముని మన్ననలు పొందిన మహాకవి ఠాగూర్.....!!

గ్రామాభ్యుదయమే దేశాభ్యదయమని"వాల్మీకి ప్రతిభ" అనే నాటకరచన ద్వారా తెలియపరచిన నాటక ప్రయోక్త ఠాగూర్.
చిత్రాంగద, కచ-దేవయాని, ముక్తదార, పోస్టాపీసు  వంటి ఎన్నెన్నో నాటకాలను రచించెను
"గోరా"నవల మత సామరస్యానికి ప్రతీక  గా నిలిచెను.
శాంతినికేతన్ విద్యాలయాన్ని  నైతిక, సనాతన సంప్రదాయములకొరకై,
కళానికేతన్ కళ ల కొరకై స్థాపించి,డెబ్బది సంవత్సరముల వయస్సులో చిత్రలేఖనం నేర్చుకొని పారిస్, న్యూయార్క్ వంటి దేశాలలో ప్రదర్శించన 
సాహిత్య, కళాతపస్వి ఠాగూర్...........!!

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకు తిరుగుతాడో  అటువంటి ప్రపంచంలో ఉండేటట్లు చెయ్యి అని భగవంతుని కోరిన మహానుభావుడు.
"జనమనగణ గీతాన్ని"
జాతీయగీతంగా ప్రభుత్వం ప్రకటించడం దేశం వారికిచ్చిన అత్యున్నత గౌరవం. అందుకే మీరు 
బహుముఖ ప్రజ్ఞాశీలి ,విశ్వకవియే
అందుకోండి మా శతకోటి వందనములు..........!!


కామెంట్‌లు