" కన్నవారు "(ప్రారంభాక్షరం 'క');--గద్వాల సోమన్న ,సెల్:9966414580.
కలహమేల మానవా!
కనికరమిల కోరువా!
కలసివున్న సుఖమేగా!
కలవరము దూరమేగా!

కన్నవారు ఇలవేల్పులు
కంటతడి పెట్టనీకు
కన్న మనసు చిన్నబోవు
కలతలకు గురి చేయకు

కడలి యంత వారి ప్రేమ
కలిమి కన్న మిన్న ప్రేమ
కనుపాపలా కాయుదురు
కనుము వారి త్యాగ గుణము

కడుపుకింత తిండి పెట్టు
కలుగునోయి దీవెనలు
కష్టబెట్ట వద్దు సుమ్మీ!
కన్నవారు మహనీయులు


కామెంట్‌లు