సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం
   చెప్పకు...తప్పకు..
     *******
చెప్పకు..తప్పకు.. ఈ పదాలు రెండూ ఎంతో బరువైనవి. దాచడానికి కూడా ఒకోసారి ఇబ్బంది పెట్టేవి.
అవే మనలోని విజ్ఞత, వివేకానికి, హృదయ సంస్కారానికి పరీక్ష పెట్టేవి.
 ప్రాణ సమానంగా నమ్మి తమ రహస్యాలను, పరువూ, ప్రతిష్ఠకు సంబంధించిన బాధలను ఆత్మీయంగా చెప్పుకుంటూ ఉంటారు.
 ఏదైనా తెలిస్తే ఇక మనసు ఆగక పోవడం సహజం.. తనకు ఆత్మీయమైన వారికి చెప్పాలని ఉబలాటపడుతుంది.
 కాబట్టి ఇలాంటి విషయాల్లోనే జాగ్రత్త పడాలి
మనకు ఎంత దగ్గరి వాళ్ళయినా మనపై ఎంతో నమ్మకంతో దాచమన్న ఇతరుల విషయాన్ని  బయటకు చెప్పకూడదు.

ఇలా ఒకరి విషయాలు ఒకరికి చెప్పకుడా, ఎప్పటికీ మాట తప్పకుండా,.నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండటమనేది మన హృదయ ఔన్నత్యాన్ని చాటే గొప్ప గుణం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు