ముప్పు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కలిసి మెలిసి తిరిగినపుడె 
స్నేహమెంతో పెరుగు 
చేయి చేయి కలిపినపుడె 
శాంతి గీతి పలుకు 
నయము తప్పవద్దు 
భయము అది రద్దు 
మంచి బాట నడువు 
మంచి మాట నుడువు 
దానమెపుడు విడకు 
ధర్మమెపుడు చెడకు 
నీతి విడుట తప్పు 
జాతి కదియె ముప్పు !!

కామెంట్‌లు