శత్రు బాధ;-- సుమ

 కంటి లోని నలుసు
చెప్పులోని రాయి
చెవి లోని జోరీగ కంటే
శత్రు బాధ ఎక్కువ
శత్రుత్వానికి కారణం...
ఓర్వలేనితనం...అత్యాశ...
అతి స్వార్థం...అమానుషత్వం
కరకు బాణాలు గా కనిపిస్తాయి
ఎంతటి వారికైనా శత్రువులు ఉంటారు
శత్రు బాధ వల్ల మనశ్శాంతి ఉండదు
కానీ మనలో నిద్రాణమైన శక్తిని జాగృతం చేస్తుంది
ఎల్ల వేళలా సమర సన్నద్ధుడిని చేస్తుంది
ప్రతిబంధకాలను చీల్చి వేస్తూ విజయంవైపుకు
సాగిపోయే గుణం అలవడుతుంది...
కామెంట్‌లు