స్వంత రచనలకు
స్వీకారం చుట్టి ....
ఫార్వార్డ్ ప్రక్రియకు
స్వస్థిపలికి .....
ఇతరుల పోస్టింగుల్లో
చోరబడి -
కామెంట్లు చేయడం
మానుకుని -
అయినవారికీ -
కానివారికి ....
ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి
అమూల్యమయిన
సమయాన్ని
వృధాచేయకండి !
ఉన్నస్నేహితులతో
కలసి .....గ్రూపులో
సాహిత్య సువాసనలు
వెదజల్లండి ....
కవులుగా-రచయితలుగా ,
మీకంటూ ....ఒక ,
ప్రత్యేకతను -
చాటుకోండి ....!!
***
మార్గదర్శనం ..!!;-డా.కె.ఎల్వీ.--హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి