మృత్యుదేవత కౌగికికి సోపానమే.;-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.--విశాఖపట్నం
 నేటి సమాజంలో నాగరికత ముసుగులో
పెద్దల,జన్మనిచ్చిన తల్లిదండ్రుల  మాటాను పెడచెవిన పెట్టి
నూనూగు మీసాల వయస్సుకు ముందే
రంగుల ప్రపంచంలో
రింగు రంగుల పొగవదులుతు
ప్లబ్ ల వెంట, క్లబ్ ల వెంట తిరుగుతు ,అదే స్వర్గమని తలచి యువతీయువకులు
సంచరిస్తు 
సంస్కార హీనులై మృగాలకన్న హీనంగా ప్రవర్తిస్తు
చివరికి ఇరవై లోనే అరవై వయస్సుకు చేరి రోగాల బారిన పడి 
కన్నవారికి వేదన కలిగించి
తాము సుఖపడుతున్నామనే భ్రమలో మృత్యుదేవత ఒడిలోకి చేరుతున్న
ఓ యువతా మేల్కొనండి
నిర్వీర్యం గాక ఉక్కునరాలు కలిగి దృఢ సంకల్పంతో దేశాభివృద్ధికి తోడ్పడి  స్వామి వివేకానంద అడుగు జాడల్లో నడచి సమ సమాజాభివృద్ధికి పునాదిరాళ్ళు వేయండి
వసుదైక కుటుంబానికి
ఆదర్శంగా నిలిచి తిరిగి జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న రామరాజ్యానికి
సోపానాలు కండి
మృత్యుదేవత ఒడిలోనికి పోయే సోపానాలు గా మారక పూర్ణాయుర్ధాయానికి ప్రతీకలు గా మారండి....!!
...........................
లోకా సమస్తా సుఖినో భవంతు
................................
...............................

కామెంట్‌లు