కందములు //
జైవాతృకుడౌ హనుమను
పావన మూర్తిని నిరతము భక్తిగ పిలువన్
నీ వేదన తొల్గు నెపుడు
శ్రీవరలును గేహమందు సేమము కలుగున్
శ్రీరామదాసుని దలచ
తోరపు బుద్ధినొసగి మన దుర్గుణములనే
దూరము చేయుచు తానే
చేరి యశంబు
నిడుచుండి చింతలు తీర్చున్
సీతారాముల బంటగు
వాతాత్మజునిని
బొగడగవశమా యజుకున్
ధాతగ నిలుచును భవితకు
భీతిని పోద్రోలి విభుడు ప్రీతిని జూపున్
కేసరి పుత్రుడు మారుతి
చేసిన ఘనకార్యములకు జేజే యనుచున్
వాసిగ మ్రొక్కగ సురలున్
భాసుర మౌకీర్తి తోడ వర్థిలె యుగముల్
జలధిని దాటిన బలుడట
తలవంచని వీరుడౌర!ధరణిన్గలడా!
కొలిచిన వారికి సులభుడు
బలహీనుల చెంతనిల్చి ప్రాపిడి కాచున్ //
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి