వానకురిసి... వచ్చిన వరదలో
చేపలెన్నొ కొట్టుకొచ్చెను
తేరగా వచ్చిన చేపలు పట్టగ
. పల్లె జనం పరుగులు తీసెను!
గెంతుతున్న చేపలు చూసి.....
పిల్లలుకూడా గెంత సాగెను
చేతికిదొరికిన చేపలుపట్టుకు
. పిల్లలు,పెద్దలు ఇళ్లకు చేరెను!
లచ్చమ్మ బొచ్చు చేపను...
ముక్కలన్ని ఇగురుచేసెను
ములక్కాడ, టమాటాలతో...
బుర్రలు,తోకలు పులుసు పెట్టె!
బుచ్చమ్మ బంగారుపాపను
మషాల పెట్టి వేపుడుచేసెను
చక్రంలాంటి చేప ముక్కను
చిట్టి, లొట్టలేసుకు తినెను !
ఒకరింట మారుపులు
.వేరొకరింట సవడలు
. ఘమ, ఘమలాడే వాసనలు
ఇంటింటా గుభాళించెను !
చేపలు దొరకని వారికి కొందరు
పోరట గా కూరలు ఇచ్చెను
ఆరోజు అందరిళ్ళలో...
చేపలకూరలుసందడిచేసెను
పల్లె అంతా ఆనందంతో....
పండుగరోజులు గుర్తుచేసెను
పిల్లలంతా మరోమారు
వానరాకకై ఎదురుచూసెను!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి