ఆదర్శ సహోదరులు @- కోరాడ నరసింహా రావు
* హ్యాపీ బ్రదర్స్ డే *
 *******
తండ్రి బీజంతో, తల్లి క్షేత్రం లో 
రూపుదిద్దుకున్న తనువులు !
అదే రక్తము, అవే గుణాలు... 
సహోదరులై దీర్ఘకాలం సహ జీవనం... !అన్నదమ్ములంటే... 
ఆప్యాయత, అనురాగాల ప్రతి రూపాలు !
  ఇద్దరిలో ఏ ఒక్కరికి కష్టం కలి గినా రెండోవారి హృదయంలో 
బాధ... కన్నీరై కారాలి !
     ఏ ఒక్కరు అభివృద్ధి చెందు తున్నా, రెండోవాని మనసు ఆ. నందంతో పొంగిపోవాలి !
 అన్నదమ్ములంటే...రామ,లక్ష్మ ణుల్లా జీవించాలి !
 వాలి, సుగ్రీవుల్లానో, రావణ, వి భీషణుల్లానో జీవిస్తే... సహోదర త్వానికే తలవంపులు  కదూ..!!
ఆస్తులకోసం, అన్నదమ్ముల్నీ... 
వాళ్ళ బిడ్డల్నీ హత్యలు చేయిం చేవారు సోదర సంబంధానికే... 
తలవంపులు కదూ... !
   మన ఈ పవిత్ర భారతభూమి లో జన్మించిన వారందరమూ... 
భారతమాతబిడ్డలమే,సహోదరు లమే అనుకుంటున్న ఈ పవిత్ర ఉదాత్త భావానికి మచ్చ రానీయక... ప్రతి ఒక్కరమూ సౌభ్రాతృత్వాన్నిపరిమళింపజేసి...మనదేశపవిత్రతనుకాపాడుతూ  ఔన్నత్య కీర్తి చంద్రికల ను..ప్రపంచమంతటా ప్రసరింప జేద్దాం... జయము - జయము సహోదరా... ! శుభము నీకు సహోదరా... !!
      ******

కామెంట్‌లు