రాజకీయ సాంఘిక చైతన్యమతడుబహుముఖ ప్రజ్ఞాశాలి ఆతడుగోల్కొండ కవుల చరిత్ర లిఖితకారుడుప్రజల కడగండ్లకి చలించిన మానవీయుడుతెలంగాణ నేలకి మకుటాయమానమతడుబహుభాషా కోవిదుడైన సరస్వతీ పుత్రుడుతెలంగాణ సాహితీ వినీలాకాశాన వైతాళికుడుపత్రికలు లేనికాలాని పత్రికలు నెరపినాడుసంపాదకుడై ప్రజను చైతన్యమొనరించినాడుఅనేక ఉద్యమాలలో భూమికైన రచనలిచ్చినాడునిజాం నిరంకుశానికి వ్యతిరేకైనాడుతెలుగు ప్రజ అణచివేతలని ప్రశ్నించినాడురాజకీయపు చీకటి బజారులో తానుఏనాటికీ ఇమడలేనన్న నిజాయితీపరుడుమిత్రునితో చెప్పుకుని కలతచెందిన వధాన్యుడుతొలి ఆంధ్ర సభకి అద్యక్షుడాతడుఉపన్యాసములన్ని తెలుగులో ఉండాలంటుతెలుగు భాషాభిమానం చాటిన ఘనుడతడువారి జీవితం సర్వతోముఖ సాంఘిక సాహిత్యఉద్యమ కారుడై నేటికీ ఉదాహరణగా నిలిచినదిఆతడే మరెవరో కాదు మనసు వరంగా పొందినమన సురవరం ప్రతాపరెడ్డిగారు.
మన'సు' వరం - మన సురవరం;-ఉమామహేశ్వరి యాళ్ళ.విశాఖపట్టణం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి