"కృష్ణ వేణీ తెలుగింటి విరి బోణీ" అంటూ సుమంత్ శకుంతల జడ దొరకబుచ్చుకుని పాటందుకున్నాడు.
"అబ్బో అబ్బాయి గారు మంచి హుషారుగా ఉన్నారే! అబ్భా...జడ వదలండీ" అన్నది మురిపెంగా!
"తుమ్మెద రెక్కల్లాంటి నల్లని ఒత్తయిన కురులు... బారెడు జడ... చివర చక్కగా కుచ్చు లాగా ఉండి నన్ను నిలవనివ్వట్లేదోయ్" అన్నాడు.
"అత్తయ్య చూస్తారు..ఉండండీ" అని వంటింట్లో దూరింది.
"అమ్మాయ్ చీరలకి గంజి పెడదామన్నావు కదా..ఇదిగో గంజి ఉడక పెట్టాను చీరలు పట్రా" అన్న అత్తగారి మాటలకి బెడ్ రూంలోకి వచ్చిన శకుంతల నడుము చుట్టేసి "అందాల వడ్డాణం అమరించాలి అని తలచానే కానీ ఆ నడుమేది...ఇంతకీ నడుము ఉన్నట్టా...మరి లేనట్టా" అంటూ కవిత్వం ఒలకబోశాడు.
"అబ్బబ్బా ఏమిటి ఈ అల్లరి...వదలండి" అని బుగ్గ మీద దొంగ ముద్దు పెట్టి పారిపోయింది శకుంతల.
రాత్రి భర్త గారి కవిత్వాన్ని, చిలిపి చేష్టలని తలచుకుంటూ గదిలోకొచ్చిన శకుంతలకి గదిలో దీపం బదులు అంతటా పరుచుకున్న వెన్నెల కాంతి ఆహ్లాదంగా అనిపించింది.
పడక చేరిన భార్య కళ్ళల్లోకి చుస్తూ "కన్నులే నవ్వేయి..వెన్నెలలు చిందేయి...ఆశలే పొంగేయి..అందుకే ఈ హాయి..చల్లని ఈ రేయి" అని చుట్టేశాడు.
"చీకట్లో కళ్ళ అందాలు ఏం కనిపించాయండీ" అన్నది పరవశంతో కళ్ళు మూసుకుంటూ!
"నీ కళ్ళల్లో మెరుపులు చూద్దామనే లైట్ తీసేశానోయ్" అన్నాడు.
"అందుకే నేను కళ్ళు మూసేశాను. ఇప్పుడు కనుక్కోండి ఎక్కడున్నానో" అంటూ ఆట పట్టించింది.
"నీకు తెలుసా...కళ్ళల్లో సహజమైన మెరుపు అందరికీ ఉండదు. నిన్ను మొదటి సారి చూసినప్పుడు ఆ మెరుపుకే నేను ఫిదా అయిపోయాను. అప్పుడే నిన్ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించేసుకున్నాను. అమ్మా నాన్నా కూడా ఓకే అనేశాక...నా సంతోషానికి అవధులు లేవు" అన్నాడు.
"అవునండీ మా తాతయ్య, నాయనమ్మ, మా ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా నా కళ్ళు ప్రత్యేకమైన కాంతితో ఉంటాయనే వారు. నా కళ్ళు కదా...నాకు తెలియవు" అన్నది బుంగ మూతి పెట్టి.
"శరీర సాముద్రిక శాస్త్రం ప్రకారం అలాంటి కళ్ళున్న వారి మనసు నిబ్బరంగా, నిండుగా, మంచి ఆలోచనలతో ఉంటుందిట. భర్త పట్ల ప్రేమ, కారుణ్యం పుష్కలంగా ఉంటాయిట..రామాయణం లో సీత గురించి చెబుతూ ఎవరో పెద్దలు అనగా విన్నాను" అన్నాడు.
"అబ్బో మీకు సాముద్రిక శాస్త్రం కూడా తెలుసా" అన్నది అతని గుండెల్లో మొహం దాచుకుంటూ!
గతం అంతా తెర మీద కదులుతూ ఉండగా శకుంతల కళ్ళల్లో నీరు చిప్పిల్లింది.
@@@@
"మాయదారి వెధవలు... రోడ్డు చూసుకోకుండా తాగి డ్రైవింగులు? ఎన్ని నిండు ప్రాణాలు బలి అవుతున్నాయో!"
"ఈ వయసులో కూడా లేడి పిల్ల లాగా చెంగు చెంగున ఇల్లంతా పరుగులు పెడుతూ అన్నీ తనే అయి తిరిగే నా కోడలు పిల్లని...ఎవడో కన్నూ మిన్నూ కానక చేసిన డ్రైవింగ్ తో అర్ధాయుష్కురాలిని చేసి, పొట్టన పెట్టుకుంటున్నాడు! ఈ వయసులో మాకీ కష్టమెందుకు స్వామీ" అని కనపడని దేవుళ్ళని ప్రశ్నిస్తూ కాంతమ్మగారు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు.
శ్రీశైలం వెళ్ళొద్దాం అత్తయ్యా అన్న శకుంతల కోరిక తీర్చటానికి కుటుంబం అంతా ఆ ఆదివారం మల్లన్న దర్శనం చేసుకుని వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ శకుంతల కడుపు భాగం మీద నించి వెళ్ళటంతో కిందిభాగం అంతా నుజ్జు నుజ్జు అయి చావు బతుకుల్లో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నది.
దగ్గరకి రమ్మని భర్తని సైగ చేసి పిలిచి "ఏమండి...ఎంతో సేపు బతకనని మీకు, నాకు కూడా తెలుసు. దిగులు పడకండి. నా కళ్ళల్లో ప్రత్యేకమైన మెరుపు ఉంది అంటుంటారు కదా! అలాంటి కళ్ళు నా శరీరంతో పాటు వృధాగా కాలిపోకుండా దానం చెయ్యండి. అప్పుడు మరణం తరువాత కూడా నేను జీవించే ఉంటాను. ఒక అభాగినికో, అభాగ్యుడికో ఈ లోకంలో అందాలు చూసే అవకాశం దొరుకుతుంది" అన్నది శకుంతల మధ్యలో తెలివి వచ్చినప్పుడు.
"అలా అవయవ హీనంగా అగ్ని దేవుడికి దేహాన్ని సమర్పించటం మహా పాపం రా! గుడ్లు పెకలించి తీసుకెళుతుంటే చూడలేం నాయనా" అన్నది కాంతమ్మ గారు.
"అవయవాలు దానం చెయ్యటం ద్వారా చనిపోయిన వ్యక్తి ఇంకో జీవితాన్ని అప్పటికప్పుడే పొందినట్లే బామ్మా! అమ్మది చాలా మంచి నిర్ణయం! కొన్ని విషయాలుసెంటిమెంట్లతో ముడిపెట్టకూడదు" అన్నాడు పవన్ నిబ్బరంగా, పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ ...అమ్మ అలా అర్ధంతరంగా వెళ్ళిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయినా!
@@@@
తన కోరిక తన కుటుంబ సభ్యులు హాస్పిటల్ వారికి తెలియజేశారా?
ఎవరైనా వస్తున్నారా..లేదా అని శకుంతల ఆత్మ అక్కడే తన పార్ధివ దేహం దగ్గర ఉండి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది.
ఆ:( హాస్పిటల్ వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నట్టే ఉన్నారు! అందరూ పక్కకి తప్పుకుని దారిస్తున్నారు. హమ్మయ్యా అని కుదుటపడి తనూ పక్కకి తప్పుకుని జరిగే తతంగం చూస్తున్నది.
అనుకున్నట్టు నేత్ర దానం పూర్తి అయి, శకుంతల శరీరాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించారు.
తరువాతి కార్యక్రమాలు చక చకా జరిగిపోయాయి.
@@@@
మనిషి వెళ్ళిపోయాక క్రమేణా దైనందిన జీవితం గడపక తప్పదు కదా!
వారు లేని వెలితి మాత్రం మనసులో చాలా కాలం అలాగే ఉండిపోతుంది.
సుమంత్ ని అలాంటి శూన్యమే ఆవరించింది.
"అబ్బాయ్ పవన్ మన గురించే వేరే దేశాలకి వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగం చూసుకున్నాడు. వాడికి పెళ్ళి చేస్తే మనకి కూడా ఇంట్లో కాస్త సందడిగా ఉంటుంది. నువ్వు ఊ:( అంటే మనకి తెలిసిన వాళ్ళ ద్వారా వాకబు చేస్తాను" అన్నారు కాంతమ్మగారు కొడుక్కి అన్నం వడ్డిస్తూ!
"నీ ఇష్టం అమ్మా. వాడ్ని కూడా ఒక సారి అడిగి చూడు..ఎవరైనా వాడి మనసులో ఉన్నారేమో" అన్నాడు సుమంత్ పెరుగన్నం ముగించి చెయ్యి కడుక్కుంటూ!
@@@@
"నా ప్రాణమైన శకుంతల ఉండి ఉంటే ఇప్పుడు కోడలిని చూసుకోవటంలో ఎంత హడావుడి చేసేదో! ఈ పిల్లని చూసి ఎంత సంతోషపడేదో" అనుకున్నాడు సుమంత్ పవన్ పెళ్ళి చూపులకి వెళ్ళి..కుందనపు బొమ్మలాగా ఉన్న సుమని చూసి!
"సుమంత్ గారూ మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలండి. తరువాత ఎవరి ద్వారా అయినా తెలిస్తే లేనిపోని అపార్ధాలు రావచ్చు. అయినా మేం కూడా నిజం దాచిపెట్టి పెళ్ళి చెయ్యాలనుకోవట్లేదు."
"మా అమ్మాయి సుమకి కాలేజి ల్యాబ్ లో జరిగిన ఒక పేలుడులో కంటి చూపు పోయింది. వెంటనే ఆపరేషన్ చేసి ఐ బ్యాంక్ ద్వారా పొందిన కంటిని అమర్చారు. మీకు తెలియనిది ఏముంది..తనకి ఇప్పుడు చూపు పూర్వం లాగానే ఉంది. ఏ సమస్యా లేదు."
"మా అమ్మాయి ఎమ్మెస్సి, పిహెచ్ డి కూడా ఆ తరవాతే చేసింది" అన్నారు సుమ తండ్రి ప్రభాకరం గారు.
"ఇంటికెళ్ళి మాట్లాడుకుని చెబుతామండి" అని చెప్పి వచ్చేశారు.
చూసొచ్చిన పెళ్ళి కూతురు సుమ గురించి ప్రభాకరం గారు చెప్పిన మాట కాంతమ్మగారికి, పవన్ కి చెప్పాడు సుమంత్.
@@@@
ప్రభాకరం గారు ప్రత్యేకంగా చెప్పిన విషయం మినహా ఇంటిల్లిపాదికి సుమ నచ్చింది. వారి కుటుంబం నచ్చింది.
ఆ అమ్మాయి కంటి విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అని రెండు-మూడు రోజులు తర్జన భర్జన పడి చివరికి వారికి ఓకే చెప్పటానికి నిర్ణయించుకున్నారు.
వివాహమయి ఇంట్లో కాలు పెట్టిన సుమని కుటుంబ సభ్యులందరూ ఆప్యాయంగా హత్తుకున్నారు.
పెళ్ళిలో తన పాదాలకి నమస్కరించిన కోడలి మొహం లోకి చూడటం సభ్యత కాదని ఊరుకున్న సుమంత్...వచ్చిన మూడో రోజే బాధ్యతలు భుజాన వేసుకుని, మామగారికి కాఫీ తెచ్చిన సుమని పక్కన కూర్చోమని "అమ్మా నీకు ఇక్కడ బాగుందా? ఎప్పుడు మీ వాళ్ళని చూడాలనిపిస్తే అప్పుడు చెప్పు..నేనో మా అబ్బాయో తీసుకెళతాం" అని మొహంలోకి చూశారు.
ఒక్క సారి ఉలిక్కిపడి మొహం వంక, కళ్ళ వంక తేరిపార చూశారు.
"మామయ్యా ఏమిటి ఎందుకలా చూస్తున్నారు? మా నాన్నగారు మీకు అంతా చెప్పానన్నారే" అంది తలదించుకుని.
"అబ్బే ఏం లేదమ్మా! ఏదో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి అలా చూశాను. నీ గురించి, కాలేజిలో జరిగిన సంఘటన గురించి నాకు పెళ్ళికి ముందే అన్నీ చెప్పారు. నువ్వు లోపలికెళ్ళమ్మా" అని తనూ గదిలోకెళ్ళి శకుంతల ఫొటో చూస్తూ నిలబడ్డాడు.
"అబ్బాయ్ అలా చీకట్లో కూర్చున్నావేం" అంటూ వచ్చి లైటేశారు కాంతమ్మగారు.
"అమ్మా నువ్వు సుమని దగ్గరగా చూశావా? ఎందుకో నాకు అవి శకుంతల కళ్ళేనేమో అనిపిస్తున్నది. మళ్ళీ శకుంతల మనింటికొచ్చిందంటావా" అన్నాడు తల్లి చెయ్యి పట్టుకుని.
"అయ్యుండచ్చు. అయినా ఒక సారి డొనేషన్ ఇచ్చాక వారి వివరాలు గోప్యంగా ఉంచుతారుట కదా! ఇతరులకి..ఆఖరికి తీసుకునే వారికి కూడా అది చెప్పరుట! అదీ ఒకందుకు మంచిదేలే. మనమ్మాయి మళ్ళీ మనింటికి వచ్చిందని సంతోషిద్దాం! నిజానికి కంటి విషయం విన్నాక.. ఈ సంబంధానికి వెళ్ళాలా వద్దా అని మనం తర్జన భర్జన పడ్డాం!"
"పోనీలే మంచి నిర్ణయమే తీసుకున్నామన్నమాట" అన్నారు.
@@@@
"మా అమ్మే మళ్ళీ వచ్చిందనుకుంటున్నారు మా బామ్మ, నాన్న. ఆవిడ అలా అర్ధంతరంగా చనిపోవటం మా ఇంట్లో పెద్ద విషాదం! నిన్ను చూసి ఉంటే మా అమ్మ ఎంత సంతోషించేదో" అన్నాడు పవన్ మనస్ఫూర్తిగా, భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
"అవును..అత్తయ్యగారి గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఆవిడని చూడకపోవటం నా దురదృష్టమే" అన్నది సుమ.
"ఎలా చూస్తావ్. ఆవిడ బతికుండి చూడగలిగినప్పుడు నువ్వు ఆవిడ కళ్ళతో చూడలేవ్ కదా" అన్నాడు.
"అంటే..." అన్నది ఆశ్చర్యంగా!
"నీ కళ్ళు మా అమ్మవేనని మా బామ్మ, నాన్న నమ్మకం. అందుకే ఆవిడ నీ ద్వారా తన కళ్ళతో మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూస్తున్నది అనుకోవాలి. ఇలా జరగటం ఎంత ఆశ్చర్యం కదా!" అన్నాడు.
" అవునులే!"
"ఈ బాధ్యత లేని డ్రైవర్ల వల్ల అత్తయ్యగారి లాగా ఎన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో కదా!"
"వీళ్ళల్లో ఎక్కువమంది నేరస్థులు..జైలుకెళ్ళొచ్చిన వాళ్ళేననుకుంటా!"
"ఇలా ప్రమాదాలు చేసిన వారి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చెయ్యటంలో ప్రభుత్వాలది అలసత్వం.. బాధ్యతా రాహిత్యం!"
"ప్రజల ప్రాణాలకి భరోసా లేకుండా పోతున్నది. ఎన్ని కుటుంబాలు ఇలాంటి విషాదాలకి గురవుతున్నాయో" అన్నది నిట్టూరుస్తూ!
"అవును... మేం ఆవిడని బాగా మిస్సవుతున్నాం!" అన్నాడు.
@@@@
"అమ్మాయ్ ఈ రోజుల్లో పిల్లల్ని కనటం వాయిదా వేస్తున్నారు మీ తరం!"
"ఇంట్లో పసిపిల్లలు తారాడితే ఇంటిని ఆవరించిన స్తబ్ధత కొంత తగ్గుతుంది. మాకో నలుసునిచ్చారంటే నేను, మీ మామగారు ఆ పుట్టే వారితో ఆడుకుంటూ జరిగిన కష్టాన్ని కొంతైనా మరిచిపోగలం" అన్నారు కాంతమ్మ గారు ఉపోద్ఘాతం లేకుండా!
"మామ్మగారూ...సాయంత్రం నేను, మీ మనవడు డాక్టర్ దగ్గరకి వెళదామనుకుంటున్నాం! అది చెప్పటానికే వచ్చాను" అన్నది సిగ్గు దాచుకుంటూ!
"హమ్మ భడవా...నా దగ్గరే దాచావా! ఉండు" అని దిష్టి తీసి సుమకి కళ్ళు, కాళ్ళూ కడిగింది.
@@@@
ప్రమాదం లో కళ్ళు పోగొట్టుకున్న తన లాంటి జీవితాల్లో ... సాధారణ పరిస్థితుల్లో అయితే భరోసా ఉండదు... ఎదుటి వారు ఎంత విద్యావంతులైనా గానీ..తను ఎంత ఉన్నత విద్యావంతురాలైనా!
అలా భయపడ్డ సుమకి వీరందరి ఆప్యాయతలు ఆ భయాన్ని పోగొట్టాయి.
దురదృష్టం తమ జీవితంతో ఆడుకున్నా...మళ్ళీ తమ సొత్తుని తమకి చేర్చటం ద్వారా న్యాయం చేసిందని సుమని చూసి అందరూ మనసారా సంతోషించారు.
వచ్చేది మనవరాలే అవ్వాలని కోరుకుంటూ...శకుంతల ఆగమనం కోసం ప్రణాళికలు వేసుకోవటం మొదలుపెట్టారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి