ముసలోళ్ళం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వృద్ధులం 
వ్యర్ధులం
వ్యాధులబారినపడినవాళ్ళం
ఒళ్ళుసహకరించనివాళ్ళం

వయసుడిగిన వాళ్ళం
చేష్టలుడిగిన వాళ్ళం
ఆశలొదిలిన వాళ్ళం
అవకాశాలొదిలిన వాళ్ళం

కొడుకులమీద బ్రతికేవాళ్ళం
కోడళ్ళకోపాలను భరించేవాళ్ళం
మనవళ్ళకు కధలుచెప్పేవాళ్ళం
మనుమరాళ్ళకు నీతులుచెప్పేవాళ్ళం 

కోర్కెలు వీడినవాళ్ళం
కోపాలు వీడినవాళ్ళం
ఏమీ లేనివాళ్ళం
ఎందుకూ పనికిరానివాళ్ళం

ముసలివాళ్ళం
ముదనష్టపువాళ్ళం
ముక్కేవాళ్ళం
మూలిగేవాళ్ళం

కంటిచూపు తగ్గినవాళ్ళం
కాటికి కాళ్ళుచాపినవాళ్ళం
మూడుకాళ్ళవాళ్ళం
మూలనకూర్చొనేవాళ్ళం

అందాలు చూడలేనివాళ్ళం
ఆనందాలు పొందలేనివాళ్ళం
బోసిపళ్ళవాళ్ళం
బట్టతలవాళ్ళం

ఇష్టాలు  లేనివాళ్ళం
కష్టాలు పడేవాళ్ళం
మాచినబట్టలు కట్టేవాళ్ళం
మంచానికే పరిమితమైనవాళ్ళం

తొసపలుకులు పలికేవాళ్ళం
తొట్రుపాటుతో నడిచేవాళ్ళం
సూక్తులు చెప్పేవాళ్ళం
సలహాలు ఇచ్చేవాళ్ళం

చీదరించకండి
ఛీకొట్టకండి
కసురుకోకండి
కనికరంచూపండి

మీ తల్లిదండ్రులం
మీ తాతానానమ్మలం
మీ బాగోగులుచూచినవాళ్ళం
మీ భవిష్యత్తుకుపాటుబడినవాళ్ళం

మమ్మలను 
ఒకకంట కనిపెట్టండి
మాయొక్క
బాగోగులు గమనించండి


కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగుంది వృద్ధుల సమస్యలను అన్నింటిని కళ్ళకు కట్టినట్టు చూపించారు
Unknown చెప్పారు…
చాలా బాగుంది వృద్ధుల సమస్యలను అన్నింటిని కళ్ళకు కట్టినట్టు చూపించారు
Madhukar చెప్పారు…
చాలా బాగుంది వృద్ధుల సమస్యలను అన్నింటిని కళ్ళకు కట్టినట్టు చూపించారు