ఆణిముత్యాలు (కందములు);-మిట్టపల్లి పరశురాములు
పలుకగవలెనుగచక్కగ
చిలకలవలెమానవుండుచిరునగుతోడన్
పలుకులుతూటలవంటివి
పలికెడిమంచినుడువులునుపరవశమొందన్

మాటలతీరునుజూడగ
కోటలుదాటునుమనుజులుకోతలుకోయన్
ధీటుగపనులనుజేయగ
సాటిగనీకెవరురారుసాగుముముందున్

మానవజన్మనెధన్యము
దానవునిగమారబోకుధరణిలొనెపుడున్
దానముజేయగపేదకు
మానవుడేమారిపోవుమాధవుతీరున్
                   **


కామెంట్‌లు