చేస్తాం (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పిల్లలం మేం పిల్లలం 
ఆనందాలా జల్లులం 
అమ్మ పనులలో 
సాయం చేస్తాం 
నాన్న పనులకూ 
చేయందిస్తాం
తాతగారికీ 
ఆసరా అవుతాం
గురువుగారినీ
గౌరవిస్తాం
మా పనులూ 
మేమే చేస్తాం
పిల్లలం మేం పిల్లలం
ఆనందాల జల్లులం!!

కామెంట్‌లు