జీవిత సత్యం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు. లంక అష్టైశ్వర్యాలతో తులతూగిన దేశం దాని పరిపాలకుడు దశకంఠుడు. తన రాజ్యంలో ఏ ఒక్కరికి కష్టం నష్టం జరగకుండా  సుఖమయ జీవితాన్ని గడపడానికి  కంకణం కట్టుకున్న వేదమూర్తి. వేదాలు ఆపోసన పట్టిన వాడు. రాజకీయ శాస్త్రం ఆయనకు తెలిసినట్లు మరొకరికి తెలియదు అంటే అది అతిశయోక్తి కాదు. జీవితంలో  శ్రీరామచంద్రమూర్తికే  రాజకీయ నీతి చెప్పిన మహానుభావుడు. జీవితంలో తన మనసు దేనిని మంచిది అని చెబుతుందో దానిని వెంటనే ఆచరించు, తరువాత చేయవచ్చునని నిర్లక్ష్యం చేస్తే జీవితంలో దానిని చేయలేవు. నీ మనస్సు చెడు అని చెప్పిన దాని జోలికి వెళ్ళవద్దు జీవితాంతం అలా చేయకూడదు అలా చేసాను కనుక నా జీవితం ఇలా అయింది. దానిని ఆదర్శంగా తీసుకోవద్దు అని చెప్పిన జ్ఞాని. సప్త సముద్రాలను శాశించగల  సత్తా కలిగిన  చక్రవర్తి  పంచభూతాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు  తాను చేసిన తప్పు వల్ల అతి చిన్న ప్రాణి కోతిమూక వల్ల లంక సర్వనాశనం అయిపోయింది. నీకు ఎంత బలం బలగం ఉన్నా కాలం కలిసి రాకపోతే  ఏమీ చేయలేవు. శ్రీరామచంద్రుడు కోతి సాయం ఎందుకు తీసుకున్నాడు  అది చేసేది కోతి చేష్ట బాణాన్ని ఎక్కు పెట్టినప్పుడు  భుజం మీదకు వెళ్లి  చక్కిలిగింతలు పెడితే అతని గురి ఏమీ అవుతుంది 
ఉడుత కూడా రాములవారికి సహకరించిన అతి చిన్న ప్రాణి  అలాంటి లంక నామరూపాలు లేకుండా పోయింది. 


కామెంట్‌లు