ఏనుగు సహాయం ;-ఎం. వి. ఉమాదేవి
సమ్మోహనం -(ముక్త పదగ్రస్తం )
(606-610l

యేనుఁగెంత మంచిది 
మంచి సాయమున్నది 
సాయపడే జీవులని సరిగచూడు వనజా !

ఆకారం పెద్దదిగ 
పెద్దశ్రమ తోడుగ
తోడుగా బరువులను  తరలించునో వనజ !

తెలివైన ప్రాణులివి 
ప్రాణ స్నేహితులునివి 
స్నేహమును విశ్వాసమును చూపునో వనజ !

అడవిలో దుంగలే 
దుంగలను  వేయులే 
వేయులే లారీకి వెనుకనే ఓ వనజ !

రైతుకిట సాయంగ 
సాయపడ ధ్యేయంగ 
ధ్యేయంగ మట్టలని తరలించెనో వనజ !


కామెంట్‌లు