పంచతంత్రము అనగానే మనకు గుర్తుకు వచ్చేది; పరవస్తు చిన్నయసూరి. ఈయన 19వ శతాబ్దం వాడు. 14వ శతాబ్దంలో దూబగుంట నారాయణ రాసిన "హితోప దేశము"అను గ్రంధాన్ని గద్య పద్యా త్మికగంగా రచించారు.
ఆయన పంచతంత్రం కథలనాధారంగా
నీతి చంద్రిక రాశాడు.
తెలుగు భాషలోే వచనంగా రచించినవాడు పరవస్తు చిన్నయ సూరి.
అందుకే"పద్యమునకు నన్నయ్య గద్యము నాకు చిన్నయ్య" అనేది లోకోక్తి.
ఈయన నీతిచంద్రిక లోని మిత్రలాభము, మిత్ర భేదము మాత్రమే రాయగా
1871లో కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు
"సంధి" రాశారు. 1872 లో కందుకూరి వీరేశలింగం
గారు మిగిలిన రెండింటిని అనగా విగ్రహము, సంధి అనే తంత్రములను చేర్చారు. అంటే యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం గారు, మిత్రలాభము మిత్రభేదానికి తను రాసిన సంధి, విగ్రహం చేర్చడం వలన నాలుగు తంత్రములు పూర్తి అయినవి. ఈ నాలుగు తంత్రములకు నారాయణకవి వ్రాసిన హితోపదేశమే మూలం.
ఈ హితోపదేశమునకు మాతృక విష్ణుశర్మ పంచతంత్రమే
తదుపరి కాలంలో ఐదవ తంత్రము అయిన
"అపరీక్షిత కారిత్వము"ను శ్రీ వేములపల్లి ఉమా మహేశ్వర పండితులు రచించి; పంచతంత్రమును పూర్తి చేశారు.
ఈ మధ్యకాలంలో చాలామంది కవులు పంచతంత్ర కథలను రాశారు. అనగా మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధి, అపరీక్షిత కారత్వము, అను 5 తంత్రములు. కానీ అవి కీర్తికెక్క లేదు. చిన్నయ సూరి రాసినట్లు మరియు కందుకూరి వీరేశలింగం పంతులుగారు రాసినవి మాత్రమే వచింప బడుచున్నవి.
చిన్నయ సూరి రాసిన మిత్రలాభం, మిత్రభేదంలో
ఆంగ్ల రచనా విధానం కనిపిస్తుంది.అంత వరకు
తెలుగులో పేరా విభజన లేదు. విద్యార్థులకు పేరాలు విభజించడం నేర్పారు. అలా తెలుగులో నూతన సంప్రదాయాన్ని నెలకొల్పారు.
(తరువాత మరికొంత)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి