భారత పతాకము ఎగిసి
మింటిని అంటెను చూడర
స్వేచ్చా వాయువు వీచెను
పసినవ్వులు విరబూయగ
౹౹ భారత౹౹
చేయి చేయి కలిపి జోత
లిడ జనని ఉల్లముప్పొంగ
అడుగు అడుగు కలిపి నడిచి
భారత ఖ్యాతిని నిలుప
౹౹భారత౹౹
గొంతు గొంతు చేర్చి విజయ
శంఖారావమ్ము లూద
త్యాగమూర్తుల త్యాగమె
ఫలించె నేటి తరానికి
౹౹భారత౹౹
:-దుగ్గి గాయత్రి,
టి.జి.టి.తెలుగు,
(గ్రా)కల్వకుర్తి,
(జి)నాగర్ కర్నూల్,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి