ఆమె కెవరు సాటి యాదరించుటలోన
కన్నతల్లి మనకు కల్పవల్లి
సూర్య చంద్ర కళల సుందర వదనమ్ము
శాంతినిచ్చు నమ్మ సర్వులకును !
తప్పుజేయగాను దండించు తల్లిగా
మంచిచెడులు నేర్పి మహినిగెల్వ
గుండెధైర్యమిచ్చు గుడిలేని దేవత
పూల కొమ్మ వలెను పుల్కరించు !!
తలకునూనె రాచి తలయంట పండగన్
పెద్దబిడ్డలైన పెనగుప్రేమ
నున్నదానిలోన నుత్సాహ భరితమ్ము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి