* తెలుసుకోండి పిల్లలూ *;-కోరాడ నరసింహా రావు !
ఘనమైనది మనుచరిత్ర 
  తెలియునా మీకు పిల్లలూ ?

మనకున్నవి ఎన్నో 
   పురాణాలు - ఇతిహాసాలు 
అవిచెప్పుచున్నవి... 
     గొప్ప - గొప్ప విషయాలు !

  ధర్మం -  న్యాయం... 
    సత్యమహింసలు... !
   దయ, ప్రేమ, సేవ, త్యాగం 
      మంచి మనుషులుగా......
 బ్రతకవలసిన, గొప్ప -  గొప్ప 
   విషయాలెన్నొ.... మన 
      పురాణాలలో ఉన్నవి !

  మనుషులై పుట్టి... 
    మహాత్ములైన... 
       మహనీయులెందరో......
  మనుచరిత్రలో ఉన్నారు !
.
ధర్మముయొక్క గొప్పతనాన్ని 
శ్రీరాముని కథ చెబుతుంది... !
ఏది నీతియో - ఏది న్యాయమో 
శ్రీకృష్ణుడు మనకు తెలిపాడు !!

 సత్యముయొక్క గొప్పతనాన్ని
 హరిశ్చంద్రుడు చాటాడు.... !
అహింస యొక్క ఔన్నత్యాన్ని 
గాంధీ జీవితమే బోధించింది !!

సేవలుచేసి తరించాలని.... 
మదర్థెరీసా  -  సత్యసాయిలు 
దానగుణంలో ఆనందాన్ని.... 
సిబి, బలి,దధీచి, కర్ణులు... 
ఆదర్శమైన తమ బ్రతుకులతో 
చక్కగా తెలియ జెప్పారు... !

మనుషులుగా పుట్టిన మనము 
గొప్పమనుషులుగా,సుఖసంతో 
షాలతో..ఆనందంగా  బ్రతికేటం 
దుకు శంకరాచార్య,బుద్ధుడు మొదలుగా... 
ఎందరెందరో మహానుభావులు పనిగట్టుకు బోధించారు... !
    
ఈ విషయాలన్నీతెలియాలంటే 
మనపూర్వులకధలనుచదవాలి 
శ్రద్దగాచదవండిపిల్లలూ! చదివి
సుఖముగాబ్రతకండిఎల్లప్పుడు 
       *******

కామెంట్‌లు