మూడు తోకల ఎలుక!; -అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆఎలుకకి మూడు తోకలు.తల్లి వాడిని బడికి పంపింది."మూడు తోకలోడా!ముచ్చట గా ఆడరా!"అని బళ్ళో తోటి ఎలుక పిల్లలు ఏడిపిస్తే "అమ్మా!నేను బడికి పోను."అని ఏడ్వసాగాడు ."సరే!జుట్టు కట్ చేసే ఆయన దగ్గర ఓతోక కోయించు "తల్లి సలహాతో రెండు తోకలతో వెళ్లాడు.రెండు తోకలున్నవాడా!ఎలా ఎగురుతావో చూపరా!"అని పిల్లల గోల తో ఏడుస్తూ వస్తే "ఒక్కటే తోక ఉంచుకో" అందితల్లి.ఐనా అల్లరి పిల్లలు ఏడ్పించటంతో ఉన్న తోకను కాస్త  కట్ చేశాడు క్షురకుడు. "తోకలేని ఎలుకా!మొండి బండ ఎలుకా!"అని ఈసారి కూడా ఏడ్పించాయి తోటిఎలుకలు.తల్లి సలహా ఇచ్చింది"తోకను అతికించమను క్షురకుని!".కానీ ఆతోకను ఎక్కడో పారేశాడు అతను.అంతే అతని కత్తి కాస్త ఎత్తుకుని పోయాడు మొండి ఎలుకగాడు! ఒక చోట కట్టెలు కొట్టేవాడు కనపడితే"ఇంద ఈకత్తి వాడుకో"అని ఇచ్చాడు ఎలుక గాడు.రెండు కట్టెలు విరిచేప్పటికి కత్తి కాస్త ముక్క లైంది. "నాకత్తి విరిగింది కాబట్టి  నీరెండు కట్టెలు లాక్కుని తుర్రుమన్నాడు మన ఎలుక గాడు. ఓఅవ్వ పిడకలపొయ్యి మండక ఆవస్థ పడటంచూసి  కట్టెలు ఇచ్చాడు.అవ్వ రొట్టెలు చేయటంతో బూడిద గా మారాయి కట్టెలు. "నాకట్టెలు బూడిద చేశావు కాబట్టి నీరొట్టెలివ్వు"అని  లాక్కుని పోయాడు ఎలుక గాడు. అంబలితాగుతూ ఢోలక్ వాయించే వాడిని చూసి "ఇదిగో  ఈరొట్టెలు తింటే గానీ నీవు బలంగా ఢోలక్ వాయిస్తూ పాటపాడలేవు"అని  రొట్టెలు  ఇచ్చింది.వాడు రొట్టెలను తినగానే" నారొట్టెలు మింగావు"అని ఢోలక్ తో పారిపోయి ఢోలక్ వాయిస్తూ "మూడు తోకలు మటుమాయం!కత్తి కట్టెలు రొట్టెలు లేకున్నా ఢోలక్ తో భలే మజా!వినండహో నాబాజా!"అని మహా ఆనందంగా పాడసాగింది.ఇంతలో ఓపెద్ద గద్ద వచ్చి ఎలుకను కాస్త ఎత్తుకుపోయింది.చెట్టు కొమ్మకి ఢోలక్ వేలాడుతూ గాలికి ఇలా శబ్దం చేస్తుంది "డబ్ డబ్ డబ్!మూడు తోకల ఎలుక ఏమాయే? అందరిని ముంచి గద్ద పాలాయే"🌹
కామెంట్‌లు